*సకాలంలో ఆన్ లైన్ పేమెంట్ లు పూర్తి చేయాలి :: జిల్లా కలెక్టర్ జి.రవి*

ప్రచురణార్థం—-2

తేదీ.28.1.2022

*సకాలంలో ఆన్ లైన్ పేమెంట్ లు పూర్తి చేయాలి :: జిల్లా కలెక్టర్ జి.రవి*
*సకాలంలో ఆన్ లైన్ పేమెంట్ లు పూర్తి చేయాలి :: జిల్లా కలెక్టర్ జి.రవి*

జగిత్యాల, జనవరి 28:- జిల్లాలో చేపడుతున్న ఉపాధి హామీ పనులకు సంబంధించిన ఆన్ లైన్ పేమెంట్ పనులు సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి.రవి సంబంధిత అధికారులను ఆదేశించారు.జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయ నుండి మండల స్థాయి మరియు ప్రత్యేక అధికారులతో వీడియో కాన్పరెన్స్ ద్వారా వైకుంఠదామాలు నిర్మాణ చెల్లింపులు, కళ్లాల నిర్మాణాల పురోగతి పై , ఈజియస్, లేబర్ టర్న్ ఔట్ , నర్సరీలు, పల్లె ప్రగతి ఇతర పనుల పురోగతి పై కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

జిల్లాలో గతంలో మంజూరు చేసిన డ్రైయింగ్ ప్లాట్ ఫామ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జగిత్యాల అర్బన్, ధర్మపురి మండలాల్లో మంజూరైన డ్రైయింగ్ ప్లాట్ ఫామ్ పనుల పురోగతి చాలా తక్కువగా ఉండటం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మండలాల వారీగా పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో కలెక్టర్ చర్చించారు. నర్సరీలలో పూర్తి చేసిన బ్యాగ్ ఫిలింగ్ లో వెంటనే సీడ్ డిబ్లింగ్ పనులు ప్రారంభించాలని , వాటి పే మెంట్స్ , మాస్టర్లు డేటా ఎంట్రీ చేయాలని ఆదేశించారు.

ఎప్పటికప్పుడు ఈ జిఎస్ లేబర్ జాబ్ కార్డులను 100% అప్గ్రేడ్ చేస్తూ , వర్క్ ఆర్డర్లు అప్ లోడ్ చేయాలని, ఇబ్బందులు తలెత్తినట్లయితె అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు. షెగిరికేషన్ షెడ్ నిర్మాణాలు లక్ష్యంలోగా పూర్తిచేయాలని, వైకుంఠదామాలు, కాంపోస్ట్ షెడ్, కళ్లాల నిర్మాణ పనులు పూర్తిచేయాలని, పనులు పూర్తయిన వాటిని వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. మండలాల వారీగా వైకుంఠధామం నిర్మాణ చెల్లింపులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

100% పనులు పూర్తయినప్పటికీ చాలా మండలాల్లో 80% పైగా మాత్రమే చెల్లింపులు జరగడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో అసంపూర్తిగా ఉన్న వైకుంఠదామలు, డంపింగ్ యార్డ్, తదితర పనులను పరిశీలించి వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో పిడి డిఆర్డిఓ వినోద్,డి.పి.ఓ., హరికిషన్, మండల ప్రత్యేక అధికారులు , ఎం.పి.డి.ఓలు , పంచాయతీ రాజ్ ఈ ఈ, డి.ఈ లు,ఏ. ఈ లు, ఎం.పి.ఓ లు, ఏపీఓ లు , తదితరులు పాల్గోన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల చే జారీ చేయనైనది.

Share This Post