సకాలంలో రుణాలు అందించాలి …..

ప్రచురణార్థం

సకాలంలో రుణాలు అందించాలి …..

మహబూబాబాద్ నవంబర్ 18:

బ్యాంక్ అధికారులు, సంభందిత అధికారులతో సమన్వాయం చేసుకుని రుణాలు సకాలంలో అందేటట్లు చూడాలని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు.

గురువారం కలెక్టరేట్ ప్రగతి సమావేశ మందిరంలో డి.సి.సి., డి.ఎల్. ఆర్.సి. సమావేశంలో బ్యాంకర్ లతో సమావేశమై 2021 సెప్టెంబర్ మాసంతం వరకు చేపట్టిన కార్యక్రమంలో రుణ లక్ష్యాలు, ప్రగతిని సమీక్షించారు.

ఖరీఫ్ కాలానికి 85 వేల 295 ఖాతాలకు గాను 996 కోట్లు క్రాప్ loan లక్ష్యం కాగా, 60.78 శాతం 605 కోట్లు రుణం 47 వేల 648 ఖాతాదారులకు అందించడం జరిగిందని, రబీ కాలానికి 662 కోట్లు లక్ష్యం గా నిర్ణయించడం జరిగిందన్నారు.

బ్యాంక్ ల వారీగా లక్ష్యాలు, సాధించిన ప్రగతిని సమీక్షించారు. వారం వారం సమీక్షించుకుని ప్రగతి సాధించాలని, ముద్ర లోను, స్వయం సహాయక గ్రూప్ లకు, బ్యాంక్ లింకేజ్ పై, pmjdy, pmjjby బ్యాంక్ ల వారీగా అందించిన లక్ష్యం, ప్రగతిని సమీక్షించారు.

ఔత్సాహికులు రుణం కొరకు దరఖాస్తు చేసిన వెంటనే దరఖాస్తుదారులు నిరుత్సాహ పడకుండా సంభందిత అధికారులతో డి.పి.అర్.తయారు చేసి రుణం మంజూరు చేయాలని, దరఖాస్తులను వెంటనే పరిష్కరించి నిరుద్యోగ యువతకు సహాయ పడాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్, బ్యాంక్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
—————————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయ నైనది.

Share This Post