సక్సెస్ కి బెస్ట్ వెహికల్ సైకిల్, ముల్కలపల్లి విద్యార్థినులకు సైకిళ్ళను బహుకరించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి

పత్రికా ప్రకటన

సక్సెస్ కి బెస్ట్ వెహికల్ సైకిల్

యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాశాఖాధికారి శ్రీమతి చైతన్య జైని గారు జిల్లాలో బాలిక విద్యను ప్రోత్సహించడానికి మొట్ట మొదటగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ముల్కలపల్లి విద్యార్థినులకు స్వయంగా సైకిళ్ళను బహుకరించి ప్రారంభించిన కార్యక్రమాన్ని whatsApp, facebook వంటి వివిధ మాధ్యమాల ద్వారా చూసిన అనేక మంది ప్రేరణపొంది స్వచ్ఛందంగా విద్యార్థినులకు సైకిళ్ళను బహుకరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అనగా తేది 05.10.2021 రోజున స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బీచ్మొహళ్ళ యాదాద్రి భువనగిరి జిల్లాలో “నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్ పొందిన 17 మంది విద్యార్థినులకు మరియు ముగ్గురు పేద విద్యార్థినులకు గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి గారి చేతుల మీదుగా బహుకరించడం జరిగింది.
ఇప్పటికి మొత్తం 50 సైకిళ్ళను బహుకరించడం జరిగింది.

సైకిల్ లు అనేవి కేవలం దూరా భారాన్ని తగ్గించడమే కాకుండా.. మానసిక, శారీరక శక్తిని ఎన్నో రెట్లు పెంపొందించి ఉత్సాహాన్ని నింపుతుంది

వ్యక్తులకు వారి వారి హోదాల బట్టి కాకుండా, వారి చేసే మంచి కర్మలను బట్టే ఆ హోదాకి పరిపూర్ణత, గుర్తింపు లభిస్తుందని కలెక్టర్ గారు అన్నారు

ఈ సందర్భంగా గౌరవ కలెక్టర్ గారు మాట్లాడుతూ పేద మరియు ప్రతిభగల విద్యార్థినులకు సైకిళ్ళను బహుకరించడం మంచి కార్యక్రమములు అని మరియు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన శ్రీమతి చైతన్య జైని గారిని అభినందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పాల్గోన్న విశిష్ట అతిథి శ్రీ దీపక్ తివారి అడిషనల్ కలెక్టర్ గారు మాట్లాడుతూ.. దూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థినులకు సైకిళ్ళ బహుకరణ అభినందనీయమని , విద్యార్థినులు చక్కగా వినియోగించు కోవాలని తెలిపారు.
TSPSC డిప్యూటీ సెక్రటరీ శ్రీమతి కోవెల శ్రీమతి గారు మాట్లాడతూ ఈ కార్యక్రమంలో తను కూడా భాగస్వామిని అయినందుకు ఎంతో సంతృప్తిగా ఉందని సంతోషాన్ని ప్రకటించారు. జిల్లా విద్యాశాఖాధికారి శ్రీమతి చైతన్య జైని మాట్లాడుతూ ఈ కార్యక్రమం తనకు ఎంతో తృప్తినిచ్చిందని ఈ రోజు వరకూ మొత్తం 50 పైకిళ్ళను బహుకరించినందు కు చాలా సంతోషంగా ఉందని, సైకిళ్ళు బహుకరించిన వారందరికి కృతజ్ఞతలు తెలుపుతూ.. బాలికల ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుకుని, జీవితంలో ధైర్యంగా ముందుకు వెళ్లాలని ఈ సంధర్భంగా అన్నారు.

సైకిల్ దాతలైన కోవెల శ్రీమతి గారిని, అంజనీ చేయూత పరపతి సంఘం వారిని, బస్సా రమేష్- రాధిక లను మరియు ఇతర దాతలను కలెక్టర్ గారు సత్కరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కార్యాలయ A. D. ప్రాశాంత్ రెడ్డి, సెక్టోరల్ అధికారి యన్. అండాలు గారు, A.C.E. రంగా రాజన్ గారు మరియు సుపరిండెంట్ క్రిష్ణారెడ్డి గార్లు పాల్గొన్నారు.

 

Share This Post