సఖి కేంద్రం,సర్ సివి రామన్ సైన్స్ మ్యూజియం ప్రారంభానికి సిద్ధం చేయాలి….. జిల్లా కలెక్టర్ హనుమంతరావు

 

సఖి కేంద్రం,సర్ సివి రామన్ సైన్స్ మ్యూజియం ప్రారంభానికి సిద్ధం చేయాలి….. జిల్లా కలెక్టర్ హనుమంతరావు

జిల్లా కేంద్రంలో నిర్మించిన సఖి కేంద్రం, సైన్స్ మ్యూజియం త్వరలో మంత్రుల చేతుల మీదుగా ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులకు ఆదేశించారు.

మంగళవారం ఆయన సంగారెడ్డిలోని మహిళా ప్రాంగణంలో నిర్మించిన సఖి కేంద్రాన్ని, పాత డీఆర్డీఏ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సైన్స్ మ్యూజియం ను పరిశీలించారు.

పట్టణంలో 2 ఎకరాలలో నిర్మించనున్న వెజ్ అండ్ నాన్ వెజ్ సమీకృత మార్కెట్ నకు మంత్రులు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అట్టి ఏర్పాట్లను పకడ్బందీగా చేయాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ కు ఆదేశించారు.
సఖి కేంద్రం, సైన్స్ మ్యూజియం ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లను ఆయా శాఖల అధికారులు చూడాలని కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ రాజర్షి షా, పబ్లిక్ హెల్త్ ఈ ఈ, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డి ఆర్ డి ఓ పి డి శ్రీనివాస్ రావు, డి ఈ ఓ రాజేష్, సంక్షేమ అధికారి పద్మావతి, మున్సిపల్ కమిషనర్, రెవిన్యూ డివిజనల్ అధికారి, తహసిల్దార్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post