సఖి కేంద్రం ఆధ్వర్యంలో యాక్టివిజం కార్యక్రమంలో భాగంగా పోస్టర్ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్.

హింసకు వ్యతిరేకంగా ఆడపిల్లలు, మహిళలను చైతన్య పరచాలి

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

000000

ఆడపిల్లలు, మహిళలపై జరుగుతున్న వివిధ రకాల హింసకు వ్యతిరేకంగా ఆడపిల్లలు మహిళలను చైతన్యపరిచేందుకు వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు.

నవంబర్ 25 నుండి డిసెంబర్ 10 వరకు అంతర్జాతీయంగా ఆడపిల్లలు, ఆడవాళ్ళ పై జరుగుతున్న వివిధ రకాల హింసకు వ్యతిరేకంగా 16 రోజులు ” యాక్టివిజం ” కార్యక్రమాలలో భాగంగా సఖి కేంద్రం , కరీంనగర్ తరుపున హింసను వ్యతిరేకంగా మహిళలు, ఆడపిల్లలను చైతన్య పరచడం కోసం వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా సోమవారం రోజున కలెక్టర్ చాంబర్లో కలెక్టర్ హింస కు వ్యతిరేకంగా పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది.

వివిధ రకాల హింసను ఎదుర్కొంటున్న ఆడపిల్లలకు, ఆడవాళ్లకు ప్రభుత్వం తరఫున సఖి కేంద్రాలు, హెల్ప్ లైన్ నెంబర్ 181 వంటి ఎన్నో సదుపాయాలు ఉన్నాయని వాటిని ఉపయోగించు కోవలన్నారు. విద్య, రక్షణ ,న్యాయం, ఆరోగ్యం ,సామాజిక రంగాలలో అవసరమైన సేవలు మహిళల
పొందాలన్నారు.

 

Share This Post