సఖి కేంద్రం భవనం పూర్తి స్థాయిలో సిద్ధం చేసి, ప్రారంభానికి ఏర్పాట్లు చేసేలా చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

సిరిసిల్ల, నవంబర్ 5: సిరిసిల్ల పట్టణంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న సఖి కేంద్ర భవనం పూర్తి స్థాయిలో సిద్ధం చేసి, ప్రారంభానికి తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ సఖి కేంద్రం భవనాన్ని శిశు, సంక్షేమ శాఖ అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సఖి కేంద్రం ద్వారా మహిళల సంక్షేమం, బాధిత మహిళలకు సేవలు అందించవచ్చని తెలిపారు. 48 లక్షల రూపాయల ప్రభుత్వ వ్యయంతో 8 గుంటల స్థలంలో నిర్మించిన సఖి కేంద్రం భవనంలో అంతర్గత పనులు మిగిలిఉంటే వాటిని వెంటనే పూర్తి చేసి, భవనం పూర్తి స్థాయిలో సిద్ధం చేసి, ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేసేలా చర్యలు చేపట్టాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం ను ఆదేశించారు.
ఈ సందర్శనలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, పంచాయితీ రాజ్ ఇంజనీర్ శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.

Share This Post