సఖి సేవలపై విస్తృత అవగాహన కల్పించాలి
సఖి కార్యాలయ భవనాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్
00000
సఖి కేంద్రం వన్ స్టాప్ సెంటర్ అందిస్తున్న సేవలను జిల్లా వ్యాప్తంగా కళాశాలల్లోని విద్యార్థినులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆర్. వి.కర్ణన్ అన్నారు.
మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సఖి వన్ స్టాప్ సెంటర్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సప్తగిరి కాలనీ లో నిర్మాణంలో ఉన్న సఖి సెంటర్ భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని అన్నారు. మహిళలపై జరుగుతున్న హింస, వేధింపులు అరికట్టేందుకు ఏర్పాటు చేసిన షీ టీమ్ సఖి కేంద్రం లోనే ఉండేలా చూడాలని అన్నారు. సఖి కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న గృహ హింస, వరకట్న వేధింపులు, లైంగిక హింస బాధితులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉచితంగా న్యాయ సలహాలు అందిస్తుందని తెలిపారు. మహిళలు ఎదుర్కొంటున్న వేధింపుల నివారణ కోసం 181 మహిళా హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి సలహాలు, రక్షణ పొందాలని అన్నారు. ఈ సందర్భంగా ముద్రించిన మహిళా హెల్ప్ లైన్ పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సుజయ్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ మయంక్ మిట్టల్, జిల్లా సంక్షేమ అధికారి, మెప్మా పీడీ రవీందర్, సఖి సెంటర్ అడ్మినిస్ట్రేటర్ లక్ష్మి, డి పి ఓ వీర బుచ్చయ్య, డీఎంహెచ్వో డాక్టర్ జువేరియ, ఏ సి పి మదన్ లాల్, డి ఆర్ డి ఓ శ్రీలత, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.