సజావుగా ధాన్య కొనుగోలు:: అదనపు కలెక్టర్ ఏ. భాస్కర్ రావు

జనగామ, నవంబరు 09: జిల్లాలో సజావుగా ధాన్య కొనుగోలు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ ఏ. భాస్కర్ రావు అన్నారు. మంగళవారం డిఆర్డిఏ కార్యాలయ సమావేశ మందిరంలో (ఐ కె పి) మహిళ సంఘాల ద్వారా ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఐకెపి ద్వారా 96 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి 5 గురు చొప్పున కేటాయించినట్లు, అట్టి వారికి కొనుగోలు ప్రక్రియ పై శిక్షణ ఇచ్చినట్లు అన్నారు. కేంద్రంలో కనీస సౌకర్యాలు త్రాగునీరు, టాయిలెట్స్, లైటింగ్, 20 టార్పాలిన్లు, తూకం, తేమ శాతం కొలుచే యంత్రాలు, ప్యాడి క్లినర్, హమాలిలు అందుబాటులో ఉంచాలన్నారు. కొనుగోలు కేంద్రంలో వారి విధులు, బాధ్యతల గురించి శిక్షణలో తెలియజేసామన్నారు. నాణ్యత పరంగా అవగాహన కల్పించినట్లు, నాణ్యత పై రాజీపడవద్దని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలుకు చర్యలు చేపట్టాలన్నారు.
ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ జి. రాంరెడ్డి, డిఎంసిఎస్, సంధ్య రాణి, డిసిఎస్ఓ ఎం. రోజారాణీ, డిఏఓ రాధిక, ఎపిడి నూరోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post