సజావుగా రేషన్ డీలర్ల ఎంపిక రాత పరీక్ష

సిద్దిపేట రెవెన్యూ డివిజన్ లో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ల షాప్ లలో రేషన్ డీలర్ల ఎంపిక కోసం సిద్దిపేట పట్టణం కొండ మల్లయ్య గార్డెన్ లో శనివారం నిర్వహించిన రాత పరీక్ష సజావుగా జరిగింది.
సిద్దిపేట రెవెన్యూ డివిజన్ మొత్తం 21 చౌక ధరల దుకాణాలలో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానించగా 270 అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోగా శనివారం నిర్వహించిన రాత పరీక్షకు 223 మంది అభ్యర్థులు హాజరయ్యారు . జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు RDO అధ్య్వర్యంలో పరీక్ష నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా పరీక్షలు జరిగాయి. పరీక్ష కేంద్రాన్ని సిద్ధిపేట రెవెన్యూ డివిజినల్ అధికారి శ్రీ అనంత రెడ్డి సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు.

Share This Post