సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు, తల్లాడ, పెనుబల్లి మండలాలకు చెందిన దివ్యాంగులకు చేతన ఫౌండేషన్ వారి ద్వారా సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య చొరవతో సమకూర్చిన 40 ట్రై సైకిల్స్, 20 వీల్ చైర్లను జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ పంపిణీ చేసారు.

ప్రచురణార్ధం

అక్టోబరు 01 ఖమ్మం:

సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు, తల్లాడ, పెనుబల్లి మండలాలకు చెందిన దివ్యాంగులకు చేతన ఫౌండేషన్ వారి ద్వారా సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య చొరవతో సమకూర్చిన 40 ట్రై సైకిల్స్, 20 వీల్ చైర్లను శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య, పోలీసు కమిషనర్ విష్ణు. యస్ వారియర్తో కలిసి జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ శుక్రవారం దివ్యాంగులకు కల్లూరు వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంపిణీ చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో వికలాంగులకు చేయూత నివ్వడం గర్వించదగ్గ విషయమని, చేతన ఫౌండేషన్ చైర్మన్ ప్రవాస భారతీయలు నియోజకవర్గంలోని మూడు మండలాల్లో వికలాంగులకు ఉపకరణలు అందించడం అభినందనీయమన్నారు. వారి రోజువారి అవసరాల నిమిత్తం, పరిమితదూర ప్రయాణానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ఇదే స్ఫూర్తితో దివ్యాంగులకు చేయూతనివ్వాలన్నారు. వికలాంగులు ఆత్మ విస్వాసంతో అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారని. క్రీడల్లో సైతం రాణిస్తున్నారన్నారు. శరీరంలో ఏదో ఒక అవయవానికే వైకల్యం కాని మెదడు, ఆలోచనకు కాదని వారిలో ఆలోచన, జ్ఞాపక శక్తి ఎక్కువని వారు పట్టుదలతో ఏదైనా సాధించగలుగుతారని, అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని మనో ధైర్యంతో ముందుకు వెళ్లాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

అనంతరం నియోజకవర్గం పరిధిలో కళ్యాణలక్ష్మి పథకం కింద మంజూరైన 94 మంది లబ్ధిదారులకు శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్యతో కలసి చెక్కులను పంపిణీచేసారు. మున్సిపాలిటీకి చెందిన తడి, పొడి చెత్తను సేకరించే వాహనాన్ని వారు ప్రారంభించారు.

కార్యక్రమంలో చేతన ఫౌండేషన్ చైర్మన్ ప్రవాస భారతీయలు వెనిగళ్ల రవికుమార్, అధ్యక్షులు వెనిగళ్ళ అని కుమార్, కార్యదర్శి పసుమర్తి రంగారావు, సభ్యులు ముత్తినేని సురేష్, చంద్రకానీ నవీన్, షేక్ రషీద్, మోతుకూరి నారాయణరావు, చెరుకూరి నారాయణరావు, ముఖ్యలు ముత్తనేని సురేష్, డి.సి.ఎం. ఎస్ చైర్మన్ రాయల వెంకట శేషగిరి, కల్లూరు ఎం.పి.పి. బీదెల్లి రఘు, జడ్పీటిసి కట్టా అజయ్ కుమార్, సర్పంచ్ లక్కినేని నీరజ రఘు, ఎం.పి.టి.సి రామాల జ్యోతి, జడ్పీ, కోఆప్షన్ సభ్యులు ఇస్మాయిల్, ఆత్మా చైర్మన్ హరికృష్ణారెడ్డి, ఏ.ఎం.సి చైర్మన్ చెక్కిలాల లక్ష్మణరావు, డి.సి.సి.బి డైరెక్టర్ బి. లక్ష్మణరావు, రైతు సమన్వయ సమితి మండల కన్వినర్ డా॥లక్కినేని రఘు, రైతు సమన్వయ సమితి సభ్యులు పసుమర్తి చందర్రావు, పి.ఏ.సి.ఎస్ అధ్యక్షులు పాలెపు రామారావు, ఏ. ఎం.సి వైస్ చైర్మన్ కాటమనేని వెంకటేశ్వరరావు, తల్లాడ ఎం.పి.పి. దొడ్డ శ్రీనివాసరావు, జడ్పీ.టి.సి దిరిశాల ప్రమీల, పెనుబల్లి ఎం.పి.పి. లక్కినేని అలేఖ్య, జడ్పీ.టి.సి చెక్కిలాల మోహన్రావు, కల్లూరు సి.డి.సి చైర్మన్ భూపాల్ రెడ్డి, స్వర్ణ వెంకటేశ్వర్లు, మోత్కూర్ నారాయణరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post