సత్యాగ్రహ్ సె స్వచ్ఛాగ్రహ్ రథ యాత్ర ప్రారంభించిన కలెక్టర్

75 సంవత్సరాల భారత స్వాతంత్య్రాన్ని పురస్కరించుకొని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాల్లో భాగంగా సత్యాగ్రహ్ సే స్వచ్ఛాగ్రహ్ రథ యాత్ర పక్షోత్సవాలను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మంగళవారం నాడు కలెక్టరేట్ వద్ద జండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పంచయత్ రాజ్ శాఖ ఆదేశాల మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో స్వచ్ఛతా హీ సేవా పక్షోత్సవాలు 15 సెప్టెంబర్ నుండి 2 అక్టోబర్ వరకు నిర్వహిస్తున్నామని ఇది ప్రతి గ్రామం, మండలం , జిల్లా స్థాయిలో కొనసాగుతుందని, ఈ సందర్భంగా స్వచ్ఛత శ్రమదానం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలన స్వచ్ఛత జాగృతి యాత్రలు, తడి పొడి చెత్త నిర్వహణ మరుగుదొడ్ల వాడకం పై అవగాహన మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై ప్రజలలో అలాగే ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు, ప్రజలందరినీ బాగస్వమ్యం చేస్తూ ప్రతి గ్రామంలో గ్రామ సభ లు నిర్వహిస్తారని, సర్పంచ్ లు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో లో రథయాత్ర కొనసాగేవిధం గా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ గోవింద్ నాయక్ , డిఆర్డీఓ పిడి చందర్ నాయక్ , డిపిఓ జయసుధ , తదితరులు పలుగొన్నారు.

Share This Post