సత్యాగ్రహ సే స్వచ్ గ్రహ్ రథం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డి. హరిచందన, స్థానిక శాసన సభ్యులు ఎస్. రాజేందర్ రెడ్డి.
స్వాతంత్రం వచ్చి 75 సవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా ఆజాదికి అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రతి గ్రామము, మున్సిపాలిటీ లు స్వచ్ఛత పాటించాలానే ఉద్దేశ్యంతో ప్రజలందరికీ పారిశుధ్యం పై అవగాహన కల్పించేందుకు ఈ రథాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ డి హరిచందన, నారాయణపేట శాసన సభ్యులు యస్ రాజేందర్ రెడ్డి శనివారం మున్సిపల్ కార్యాలయంలో జండా ఊపి రథాన్ని ప్రారంభించారు. ఎవరు కూడా మురుగు నీటిని బయటకు వడలకుడదని, అందరూ ఇంకుడు గుంతలు నిర్మించుకొని. ఆరోగ్యముగా ఉండాలని సూచించారు. తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి ఇవ్వాలన్నారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్లను నిర్మించుకోవాలని బహిర్భూమికి బయటకు వెళ్లరాదని తెలిపారు. చెత్తను బయట వేయడం వలన అనేక పారిశుధ్య సమస్యలు వస్తాయని వీటన్నింటి పై సమగ్ర అవగాహన కల్పించేందుకు ఎల్.ఈ.డి తెర ద్వారా అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమం లో మున్సిపల్ కమిషనర్ భాస్కర్ రెడ్డి, జిల్లా అధికారులు గోపాల్ నాయక్, కృష్ణమాచారీ, మున్సిపల్ చైర్మన్ గందే అనుసుయ్య చంద్రకాంత్,మున్సిపల్ వైస్ చైర్పర్సన్ హరినరాయన్ భట్టాడ్, MPPశ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ లు మరియు స్వచ్ భారత్ మిషన్ కోఆర్డినెటర్స్ భార్గవ, మాలిక్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు