సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమం ద్వారా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా చిన్న గ్రామ పంచాయతీ అయినా మా గ్రామంలో నిర్మించిన పల్లె ప్రగతి వనం, షేగ్రీగెషన్ షెడ్డు, డంపింగ్ యార్డ్, స్మశాన వాటికలకు వెళ్లడానికి రహదారి సౌకర్యం లేక పోవడం మూలంగా ఇబ్బంది కలుగుతుంది కావున రహదారి నిర్మాణానికి నిధులు కేటాయించాలని భూపాలపల్లి మండలం సుబ్బక్కపల్లి గ్రామ సర్పంచ్, కరోనా మొదటి పేజ్ నుండి వంద పడకల ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతున్న వారికి ఆహారం అందించడం జరిగింది. ప్రస్తుతం వంద పడకల ఆసుపత్రిలో ఫుడ్ సర్వీస్ ద్వారా ఉపాధి కల్పించాలని భూపాలపల్లి పట్టణంలోని జవహర్ నగర్ కు చెందిన కప్పల రాజేష్, మహాముత్తారం గ్రామం మధ్యలో నాకు ఒక ఎకరం స్థలం, అందులో ఇల్లు కలదు. త్రాగడానికి మరియు ఇతర అవసరాలకు బోర్ వేసుకోవడానికి అధికారులు అనుమతి ఇవ్వడం లేదు దయచేసి బోర్ వేసుకోవడానికి అనుమతించాల్సిందిగా మహాముత్తారం గ్రామానికి చెందిన జాడీ నాగయ్య, సదరన్ క్యాంపు సర్టిఫికెట్ కొరకు దివ్యాంగులు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు కోరుతూ పేద ప్రజలు, భూసమస్యల పరిష్కారం తదితర సమస్యల పరిష్కారం కొరకు ప్రజలు అర్జీ పెట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్హత ఉన్న దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ లభించేలా త్వరలోనే సదరం క్యాంప్ నిర్వహించనున్నామని తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులు చేపట్టి పేద వారికి ఇళ్లను కేటాయిస్తామని తెలిపారు. ఈ ప్రజావాణిలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. డిపిఆర్ఓ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గారిచే జారీ చేయడమైనది.