సదరం ధృవీకరణ పత్రాన్ని పొందేందుకు కు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి… జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

ప్రచురణార్థం

సదరం ధృవీకరణ పత్రాన్ని పొందేందుకు కు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి…

మహబూబాబాద్, జూలై-29:
సదరం ధృవీకరణ పత్రాలను జారీ చేసేందుకు క్యాంపులు ఏర్పాటు చేస్తున్నందున అర్హులైన దివ్యాంగులు స్లాట్ బుకింగ్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు.

గురువారం కలెక్టర్ కార్యాలయంలో సదరం క్యాంపు లపై జిల్లా  గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సదరం ధృవీకరణ పత్రాలు జారీ చేసేందుకు ఆగస్టు మాసంలో 04, 11, 18, 25 తేదీలలో స్లాట్ బుకింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  శారీరక వైకల్యం, వినికిడి లోపం, దృష్టిలోపం, మానసిక అంగవైకల్యం, బుద్ధిమాంద్యం వంటివి వాటిపై వైకల్యం అర్హత వరకు సదరన్ క్యాంపు లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

దివ్యాంగులు గతంలో సదరం ద్వారా సర్టిఫికెట్లు తీసుకొని కాలపరిమితి ముగిసిన వారు, అలాగే కొత్తగా సదరం ధృవీకరణ పత్రాన్ని పొందేందుకు ఆయా మండల పరిధిలో సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, పట్టణ పరిధిలో పట్టణ ఆరోగ్య కేంద్రాలలో డాక్టర్లతో వికలాంగత్వం నిర్ధారణ పరీక్ష చేయించుకుని ఏదైనా మీసేవ సెంటర్ కి వెళ్లి సదరం వైకల్యం ధృవీకరణ పత్రం కోసం తేదీలను నిర్ణయించుకొని స్లాట్ బుక్ చేసుకోవచ్చు అన్నారు. ఇందుకోసం దరఖాస్తుదారు వికలాంగత్వం పరీక్ష కాపీ తో పాటు ఆధార్ కార్డు కాపీ ని మీసేవ సెంటర్ కి తీసుకువెళ్లి మీసేవ చార్జి కింద 35 రూపాయలు చెల్లించి నిర్ధారించిన తేదీలలో ఏదైనా ఒక తేదీని ఎంచుకొని స్లాట్ బుక్ చేయించుకోవచ్చు అన్నారు. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మెడికల్ క్యాంపు జరిగే ప్రదేశాన్ని, తేదీ తో పాటు స్లాట్ బుకింగ్ రసీదు ఇవ్వబడుతుంది అన్నారు.  దివ్యాంగుల వైకల్యం యొక్క అర్హత శాతం కంటే తక్కువగా ఉంటే స్లాట్ బుకింగ్ తిరస్కరించబడుతుందని తెలియజేశారు. 

స్లాట్ బుకింగ్ అయిన తర్వాత  స్లాట్ ప్రకారం దరఖాస్తుదారు స్లాట్ బుకింగ్ రశీదుతో పాటు వ్యక్తిగత మెడికల్ రిపోర్టులు తీసుకొని మెడికల్ క్యాంపు హాజరుకావాలన్నారు. క్యాంప్ నిర్వాహకులు దరఖాస్తులను పరిశీలించి వివరాలను ఆమోదిస్తారు. తద్వారా సదరం గుర్తింపు సంఖ్య నమోదు అవుతుందన్నారు. డాక్టర్ చే దివ్యాంగులకు అంగవైకల్యం అంచనా వేయబడుతుందని తదుపరి సదరం సర్టిఫికెట్ ను దివ్యాంగులకు తెలియజేసిన రోజు తేదీన అందజేయబడుతుంది అన్నారు.

కొత్తగా నమోదు చేసుకునే వారు మీ సేవ సెంటర్ లో రోజుకు 40 మందికి మాత్రమే స్లాట్ బుకింగ్ చేయడం జరుగుతుందని, అదేవిధంగా రెన్యువల్ వారికి 65 మందికి అవకాశం ఉందన్నారు ఈ విధంగా నాలుగు రోజులు క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలియజేశారు.
——————————————————————————————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post