పత్రిక ప్రకటన
తేది :19.11.2022
నిర్మల్ జిల్లా శనివారం
సదర్మాట్ ప్రాజెక్ట్ ఏప్రిల్ లోగా పూర్తి చేయడం జరుగుతుంది.
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి.
శనివారం జిల్లా పాలనాధికారి సమావేశ మందిరంలో అటవీ పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ, అదనపు కలెక్టర్ లు హేమంత్ బోర్కడే, రాంబాబు, చీఫ్ ఇంజనీరింగ్ శ్రీనివాస్ లతో కలసి నీటి పారుదల శాఖ లోని ప్రాజెక్టు, వరద నష్టం, చెక్ డ్యామ్ ల పై నీటిపారుదల అధికారులు, తహసీల్దార్లు, ప్రజా ప్రతినిధులు, ఇంజనీర్ల తో
సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ సదర్మాట్ ప్రాజెక్ట్ ఏప్రిల్ లోగా పూర్తి చేయడం జరుగుతుందని , దానికి సంబంధించి మిగిలిపోయిన అనుమతులు, అదేవిధంగా వీలైనంత తొందరగా గేట్లు అమర్చి వాహనాల రాకపోకలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామన్నారు.
సదర్మాట్ ఆయకట్టు వలన నిర్మల్ నియోజకవర్గానికి 50 వేల ఎకరాలకు నిరందించవచ్చని అన్నారు. అంతేకాకుండా 27వ ప్యాకేజీ కు సంబంధించిన నష్టపరిహారం 35 కోట్లు విడుదలైన వెంటనే దానికి సంబంధించిన భూసేకరణకు సంబంధించి నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. 28వ ప్యాకేజీ కూడా ఇంతకు ముందున్న కాంట్రాక్టర్ మధ్యలో వెళ్లిపోవడం జరిగిందని, ఏజెన్సీని మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరంలో కురిసిన వర్షాలకు చెక్ డ్యామ్ లపై ముఖ్యమంత్రి ఆరా తీసారని, అన్ని చెక్ డ్యామ్ లు బలంగా నిలబడినందున మిగిలిన చెక్ డ్యాములకు కూడా టెండర్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న చెరువులు కుంటల పునరుద్ధరణకు ప్రభుత్వం నకు నివేదికలు పంపించడం జరిగిందని, పునరుద్ధరణ కొరకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది అన్నారు. కడెం ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని చిన్న చిన్న మరమ్మత్తులు తమ దృష్టికి వచ్చాయని, ఆ సమస్యను కూడా పరిష్కరిస్తామన్నారు. అదేవిధంగా గడ్డెన్న వాగు ప్రాజెక్టుకి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే వాటిని కూడా పరిష్కరిస్తామన్నారు.
ఈ సమావేశంలో సంబంధిత జిల్లా అధికారులు, తహసీల్దార్ లు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి నిర్మల్ చే జారీ చేయనైనది.