సబ్ పోస్ట్ ఆఫీస్ ను ప్రారంభించిన జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ ముజమిల్ ఖాన్

IDOC లో సబ్ పోస్ట్ ఆఫీస్ సేవలు ప్రారంభం
సబ్ పోస్ట్ ఆఫీస్ ను ప్రారంభించిన జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ ముజమిల్ ఖాన్


IDOC లో సబ్ పోస్ట్ ఆఫీస్ సేవలు ప్రారంభం అయ్యాయి.
జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ ముజమిల్ ఖాన్ సబ్ పోస్ట్ ఆఫీస్ ను రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా సోమవారం ప్రారంభించారు.
సబ్ పోస్ట్ ఆఫీస్ ప్రారంభంతో ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి బట్వాడా సేవలు మరింత సులభతరం కానున్నాయని జిల్లా అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సబ్ పోస్ట్ ఆఫీస్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ బి చెన్నయ్య, జిల్లా అధికారులు , మెదక్ పోస్ట్ ఆఫీసెస్ సూపరిండేట్ శ్రీ MA అలీం , సిద్దిపేట సబ్ డివిజన్ మెదక్ పోస్ట్ ఆఫీసెస్ సహాయ సూపరిండేట్ శ్రీ బి వెంకన్న , సబ్ పోస్ట్ మాస్టర్ శ్రీ A చంద్ర శేఖర్ , శ్రీ బి ఎన్ రెడ్డి పాల్గొన్నారు.
——————————

Share This Post