సబ్ సెంటర్ నిర్మాణాలకు పూర్తి సౌకర్యాలు కల్పించాలి…

ప్రచురణార్ధం

సబ్ సెంటర్ నిర్మాణాలకు పూర్తి సౌకర్యాలు కల్పించాలి…

మహబూబాబాద్, అక్టోబర్01.

సబ్ సెంటర్ లను అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

శుక్రవారం రాత్రి కలెక్టర్ కార్యాలయంలో సబ్ సెంటర్ నిర్మాణాల ప్రగతిని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్లు భవనాల శాఖ ద్వారా 15, టి.ఎస్.ఎం.ఐ.డి.సి. 23, ట్రైబల్ వెల్ఫేర్ 14, ఈ.ఎం.ఐ.డి.సి.22 మొత్తంగా 74 సబ్ సెంటర్ లు నిర్మించడం జరుగుతున్నదని 74 సబ్ సెంటర్ లలో 72 సబ్ సెంటర్ లకు మిషన్ భగీరథ కనెక్షన్లు ఇవ్వడం జరిగిందన్నారు.

జిల్లాలో కేసముద్రం లో సబ్ సెంటర్ కు స్థలం ఏర్పాటు చేయాలని తహసీల్దార్ ను అదేశించామన్నారు. పెరుమాళ్ సంకీస సబ్ సెంటర్ ను బలపాల లో నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఈ నెల 23వ తేదీ వరకు 90 శాతం సబ్ సెంటర్లు పూర్తి చేయాలన్నారు. అన్ని సౌకర్యాలుతో పూర్తయిన సబ్ సెంటర్లను ఆయా నియోజకవర్గ శాసన సభ్యులు తెలియ జేయాలన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, ఉప వైద్యాధికారి అంబరీష్, ఆర్ అండ్ బి తానేశ్వర్, టి.ఎస్.ఎం.ఐ.డి.సి ఈఈ ఉమామహేశ్వర్, ట్రైబల్ వెల్ఫేర్ డి.ఈ.మధుకర్, టి.ఎస్.ఈ.డబ్ల్యు.ఐ.డి.సి.రాజ్ కుమార్ పాల్గొన్నారు.
————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి, మహబూబాబాద్ చే జారిచేయనైనది.

Share This Post