సబ్ సెంటర్ నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయాలి…జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

ప్రచురణార్ధం

సబ్ సెంటర్ నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయాలి…

మహబూబాబాద్, ఆగస్ట్,21.

సబ్ సెంటర్ నిర్మాణాలు అన్ని సౌకర్యాలతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు.

శనివారం కలెక్టర్ కార్యాలయం లో జిల్లాలో నిర్మిస్తున్న 74 సబ్ సెంటర్ల నిర్మాణాల ప్రగతిని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు, వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ వారం వారం ప్రగతి కనిపించాలని అధికారులను ఆదేశించారు.

జిల్లాలో 74 సబ్ సెంటర్లు నిర్మిస్తుండగా 69 సబ్ సెంటర్ల కు మిషన్ భగీరథ కనెక్షన్లు తీసుకోవడం జరిగిందన్నారు.

అలాగే విద్యుత్ కనెక్షన్లలో భాగంగా 74 సబ్ సెంటర్ లకు 36 సబ్ సెంటర్లకు నిధులు చెల్లించడం జరిగిందని, 27 సబ్ సెంటర్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వగా మరో 9సబ్ సెంటర్లకు విద్యుత్ కనెక్షన్లు 2రోజుల్లోగా ఇవ్వడం జరుగుతుందన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో జిల్లా వైద్యాధికారి హరీష్ రాజు, ఇంజనీరింగ్ అధికారులు తానేశ్వర్, అరుణ్ కుమార్, కృష్ణారెడ్డి , సునీత దేవి తదితరులు పాల్గొన్నారు.
———————————
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post