సమగ్ర అభివృద్దికి పట్టుదల తో కృషి చేయాలి : నీతి అయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్

ప్రచురణార్థం
ములుగు జిల్లా
డిసెంబర్,08 ( బుధవారం)

రెండు జిల్లాల సమగ్ర అభివృద్దికి పట్టుదల తో కృషి చేయాలి : నీతి అయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్
డిల్లి కేంద్రంగా సేంద్రియ వ్యవసాయ ఆదారిత మిర్చి పంట ను సహాయ సహకారం అందిస్తాం: డా.కే.రాజేశ్వర్ రావు

ములుగు, భూపాలపల్లి జిల్లాలో పాలనాపరంగా ప్రజలకు అందుతున్న అభివృద్ధి పథకాలు పనితీరు ప్రశంసనీయమని నీతి అయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ కొనియాడారు.
బుధవారం రోజున ములుగు, భూపాలపల్లి జిల్లా పర్యటనలో భాగంగా జిల్లాకు విచ్చేసిన కేంద్ర నీతి అయోగ్ సభ్యులు డా.కే.రాజేశ్వర్ రావు , నీరజ్ సింహా ,రాజేష్ రంజన్ కలెక్టర్ ప్రాంగణం లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గౌరవ వందనంస్వీకరించారు. అనంతరం ములుగు కలెక్టరేట్ కాన్ఫరేస్స్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జిల్లా పాలనాధికారి ఉన్నతాధికారులతో సమీక్ష ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరిపాలన అభివృద్ధి అంశాలపై నీతి అయోగ్ సభ్యులకు వివరిస్తూ జిల్లా పూర్తిగా గిరిజన ప్రాంతమని వనరులను సక్రమంగా వినియోగించుకుని ఆరోగ్యం మరియు పోషణ , విద్య ,వ్యవసాయం,మరియు నీటి వనరులు , ఆర్ధిక మరియు నైపుణ్యం అభివృద్ధి , ప్రాధమిక మౌలిక సదుపాయాల నిధుల వినియోగం సంబందిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని జిల్లా ప్రథమ స్థానంలో నిలిచే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. ఇట్టి విషయాలపై నీతిఆయోగ్ కోఆర్డినేటర్ రాహుల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో వివరించారు.
నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డా.రాజీవ్ కుమార్ మాట్లాడుతూ ములుగు జిల్లా ప్రత్యేక పర్యాటక ప్రాంతంగా విలసిల్లుతూ సుపరిపాలన దిశగా అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తుందని గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతూ గిరిజన ఆరాధ్యదైవమైన సమ్మక్క సారలమ్మ దేవాలయాలతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో గోదావరి పరివాహక ప్రాంత భూములు రైతులు పంటలు సమృద్ధిగా పండించుకుని అభివృద్ధి చెందుతున్నారని హర్షించదగ్గ విషయమని అన్నారు. ముఖ్యంగా రైతులు ప్రకృతి వ్యవసాయం పై మొగ్గుచూపి రసాయన ఎరువులు వాడకుండా సేంద్రియ పద్దతిలో పంటలు పండించే విధానం పై అవగాహన కల్పించాలన్నారు. తద్వారా ప్రజలు ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించిన వాళ్ళం అవుతామని చెప్పారు. ప్రభుత్వ పాటశాల , అంగన్వాడి అన్ని సెంటర్లలో నాణ్యమైన పౌష్టికాహారం అందుతుందని అన్నారు. దీనికిగాను పిల్లల ఆరోగ్య పరిస్థితి, ఉత్సాహంగా ఉండటం నిదర్శమని చెప్పారు. జిల్లా పాలనా పరంగా ప్రశంసల వర్షం కురిపించారు.
స్పెషల్ సెక్రెటరీ, నీతి అయోగ్ డాక్టర్ రాజేశ్వరరావు , మాట్లాడుతూ ఇంతకుముందు ప్రణాళికా సంఘం రద్దు చేసి లక్ష్యాలు ,జాతీయ అభివృద్ధి సలహా సంఘం నీతి అయోగ్ అనే పేరుతో మార్చబడిందని అన్నారు. విద్య,వైద్యం , వ్యవసాయం ఉద్యానవనం వచ్చే 20 సంవత్సరాల్లో ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై నీతి అయోగ్ ద్వారా ఇక్కడికి రావడం జరిగిందని అన్నారు. వెనుకబడిన జిల్లాల అయిన ములుగు, భూపాలపల్లి రెండు జిల్లాలను డిల్లి కేద్రం గా దత్తత తీసుకొని నీతి అయోగ్ కేంద్రం ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. జిల్లా కలెక్టర్ గారి సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో అభివృద్ధి వేగంగా నడుస్తుందని జిల్లా అభివృద్ధిలో స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం చేయాలని ఉన్న నిధులను వినియోగిస్తూ పనిచేయాలని అన్నారు. అంగన్వాడీ సెంటర్లలో గిరిజన పిల్లలు నాణ్యమైన పౌష్టికాహారం అందించడంలో అధికారుల విశేష కృషి చేస్తున్నారని, విద్యాపరంగా ఆరోగ్యపరంగా పిల్లలు ఉత్సాహంగా ఉన్నారని అన్నారు. జిల్లా అభివృద్ధిలో ఏమైనా ప్రతిపాదనలు ఉంటే నివేదికలు తయారుచేసి నీతి అయోగ్ కు పంపించాలని అభివృద్ధిలో భాగస్వాములై పని చేస్తామని హామీ ఇచ్చారు.
భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గౌతమ్ పోట్రు మాట్లాడుతూ ఐటీడీఏ ద్వారా ఆశ్రమ పాఠశాలలు ప్రాథమిక పాఠశాలలు, గురుకులాల ద్వారా గిరిజన విద్యార్థిని విద్యార్థులకు విద్యాపరంగా కార్పొరేట్ స్థాయిలో అన్ని వసతులు కల్పించి మెరుగైన ఉచిత విద్య అందించుటకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు దేవాదాయ శాఖ ఇ.ఓ., రాజేందర్ మేడారం సమ్మక్క సారలమ్మ ప్రధాన పూజారి జగ్గారావులతో కలిసి నీతి అయోగ్ సభ్యులను మెమెంటోలు శాలువాలతో సత్కరించి అమ్మవారి ప్రసాదం అందించారు.
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా , భద్రాచలం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి గౌతమ్ పోట్రు ములుగు అదనపు కలెక్టర్ ఇలా త్రిపాటి , ములుగు ఎఎస్పి సుధీర్ రంనాద్ కెకన్, భూపాలపల్లి అదనపు కలెక్టర్ దివాకర, డి ఆర్ వో రమాదేవి సంబందిత రెండు జిల్లాల అధికారులు పాల్గొన్నారు

Share This Post