*సమతౌల్య అభివృద్ధి దిశగా వరంగల్ జిల్లా డాక్టర్ బి. ఆర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ఆర్ధిక శాఖ జిల్లా లో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు నూతన పెన్షన్ ల జారీ అలరించిన శకటాలు, సాంస్కృతిక ప్రదర్శన లు

వరంగల్

ప్రచురునార్ధం

*సమతౌల్య అభివృద్ధి దిశగా వరంగల్ జిల్లా

డాక్టర్ బి. ఆర్ రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ఆర్ధిక శాఖ

జిల్లా లో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

నూతన పెన్షన్ ల జారీ

అలరించిన శకటాలు, సాంస్కృతిక ప్రదర్శన లు

సమతౌల్య అభివృద్ధి దిశగా వరంగల్ జిల్లా పరిగెడుతోందని డాక్టర్ బి. ఆర్ రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ఆర్ధిక శాఖ అన్నారు.

జిల్లా కేంద్రంలోని ఖుష్ మహల్ లో
జిల్లా కలెక్టర్ గోపి అధ్యక్షతన నిర్వహించిన స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలకు డాక్టర్ బి. ఆర్ రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ఆర్ధిక శాఖ ముఖ్యఅతిథిగా హాజరయి.. పోలీసు వందనం స్వీకరించి జాతీయ జెండా ను ఆవిష్కరణ చేసారు

అనంతరం జిల్లా అభివృద్ధి గురించి ప్రసంగిస్తు జిల్లాలో సమతౌల్య అభివృద్ధి జరుగుతుందని అన్నారు

వ జ్రోత్సవా లలో భాగంగా ఆగస్టు 15 నుండి కొత్త
పెన్షన్ లను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు కే సి ఆర్ ఆధ్వర్యంలో ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశం లోని మిగతా రాష్ట్ర ల వారికీ ఆదర్శం గా నిలుస్తున్నాయన్నారు

అనంతరం వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శన లు,
వ్యవసాయ, విద్య, గ్రామీణభివృద్ధి, మత్స్యశాఖ, dmho శాఖలకి చెందిన శకటాల ప్రదర్శన లు అందరిని ఆకట్టుకున్నాయి

స్వాతంత్ర్య పోరాటం లో భాగస్వామ్యం అయిన పోరాట యోధులకు ముఖ్య అతిధు ల చేతుల మీదుగా సత్కారం జరిగింది

నూతన పెన్షన్ దారులకి వ జ్రో త్సవ వేడుకల సందర్బంగా పెన్షన్ ను అందచేశారు

జిల్లాలో గత సంవత్సరంలో వివిధ విభాగాల్లో పనితీరు కనబరిచిన
ఉత్తమ ఉద్యోగులకు ముఖ్య అతిధి చేతుల మీదుగా
అవార్డులు ప్రధానం చేశారు.

చివరగా వివిధ శాఖల అధికారులు ఏర్పాటు చేసిన స్టాల్ లను ముఖ్య అతిధులు తిలకించి వారికి అభినందనలు తెలియజేశారు

ఈ కార్యక్రమం లో ఎంపీ పసునూరి దయాకర్, zp చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, mla నన్నపునేని నరేందర్, gwmc డిప్యూటీ మేయర్, కార్పొరేట్ ర్ లు, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు

Share This Post