సమన్యాయం, సత్వరన్యాయమే లోక్ అదాలత్ ధ్యేయమని సమాజ శ్రేయస్సు దృష్ట్యా రాజీ పరిష్కారానికి జిల్లా న్యాయసేవాధికార సంస్థ లోక్ అదాలత్ ల ను నిర్వహిస్తున్నదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ సి.హెచ్.కె.భూపతి అన్నారు.

ప్రచురణార్ధం

సెప్టెంబరు, 11 ఖమ్మం –

సమన్యాయం, సత్వరన్యాయమే లోక్ అదాలత్ ధ్యేయమని సమాజ శ్రేయస్సు దృష్ట్యా రాజీ పరిష్కారానికి జిల్లా న్యాయసేవాధికార సంస్థ  లోక్ అదాలత్ ల ను నిర్వహిస్తున్నదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ సి.హెచ్.కె.భూపతి అన్నారు. శనివారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ సమావేశ మందిరంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ చట్టాలు సూక్ష్మంగా ఉంటాయని అందరికి ఉపయోగపడే చట్టాలను తీసుకొని వాటిలో పొందుపర్చబడిన అంశాలను తెలియజేసి ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు జిల్లాలో లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించబడుతున్నాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అన్నారు. ప్రతిరోజు రాజీ జరుగుతున్నప్పటికీ ఇంకా దీక్షా కార్యదక్షతతో ఎక్కువ కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ దోహదపడుతుందన్నారు. చట్ట ప్రకారం బలహీనులను రక్షించుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, చట్టం, న్యాయం దృష్టిలో బలవంతులు, బలహీనులు సమానమేనని, కొన్ని కేసుల ప్రభావం సమాజంపై ఉంటుందని, వాటి సత్వర పరిష్కారం వల్ల సమాజానికి మేలు కలుగుతుందని సి. హెచ్.కె. భూపతి తెలిపారు. చిన్న చిన్న సమస్యలు అయినటువంటి కుటుంబ తగాదాలు, చుట్టు ప్రక్కలవారితో తగాదాల వల్ల కక్షలు పెరుగుతాయని, వాటిని ప్రాథమిక దశలోనే పరిష్కరించుకునేందుకు రాజీమార్గమే సులువైన పరిష్కారమని ఆయన అన్నారు. పెండింగ్ సివిల్ కేసులు క్రిమినల్ కేసులుగా మారుతాయని పెండింగ్ కేసులలో చాలా వరకు సమయం, డబ్బు వృదా అవుతుందని, అటువంటి కేసులను లోక్ అదాలత్ పరిధిలో పరిష్కార దిశగా న్యాయవాదులు, న్యాయమూర్తులు విస్తృత పరిధిలో ఆలోచన చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి తెలిపారు.

అదనపు జిల్లా న్యాయమూర్తి చంద్రశేఖర్ ప్రసాద్ మాట్లాడుతూ క్షణికావేశం, ప్రతిష్ట, పంతంతో కేసులకు వెళ్తున్నారని, కక్షిదారులు ఆలోచన చేయాలని తెలిసి కూడా తప్పు చేయడం సమంజసం కాదని, మన సమస్యలు కుటుంబంపై ప్రభావం చూపకూడదని ఆయన అన్నారు. లోక్ అదాలత్ కక్షిదారులకు సత్వర న్యాయం అందిస్తున్నదని, ఈ సదవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకోవాలని రాజీమార్గాన్ని అనుసరించి కేసులను పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. సీనియర్ సివిల్ జడ్జి న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మహ్మద్ అబ్దుల్ జావీద్ పాషా మాట్లాడుతూ. సుప్రీంకోర్టు సూచనల మేరకు దేశ, రాష్ట్ర వ్యాప్తంగా జాతీయలోక్ అదాలత్‌లను నిర్వహించబదుతున్నాయని, దీనిలో భాగంగా నేడు ఖమ్మం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలతు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జీవితానికి మించి సమస్య ఉంటే జీవితానికి అర్ధం ఉండదని, జీవితకాలంలోనే అతి స్వల్ప వ్యవధిలోనే సమస్యలను పరిష్కరించుకోవడం కోసమే లోక్ అదాలత్‌లను నిర్వహిస్తున్నామన్నారు. జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా నేడు ఖమ్మం జిల్లా న్యాయసేవాధికార సంస్థ నగరంలో 8 లోక్ అదాలత్ బెంచులను ఏర్పాటు చేసిందని, ఈ నెల 1వ తేదీ నుండి ముందస్తుగా లోక్ అదాలత్ నిర్వహించామని, జిల్లా ప్రజల నుండి మంచి స్పందన లభించదని ఆయన అన్నారు. జాతీయ లోక్ అదాలతో ముఖ్యంగా 2 లక్షల కంటె తక్కువ విలువైన చెక్కు బౌన్స్‌లు, చిట్ ఫండ్, బ్యాంక్‌ల కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కార చర్యలు చేపట్టాల్సిందిగా సుప్రీంకోర్టు సూచించిందని తదనుగుణంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థఆ దిశగా కేసులు పరిష్కార చర్యలు చేపట్టిందన్నారు.

బార్ అసోసియేషన్ అధ్యక్షులు యం. నారాయణరావు మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితులలో కూడా న్యాయవాదులు, న్యాయమూర్తులు, పోలీసు సహాకారంతో కేసుల పరిష్కారంలో ఖమ్మం జిల్లా కోర్టు ముందంజలో ఉందన్నారు. ఫ్రీ లోక్ అదాలత్ వల్ల కొన్ని కేసులను ముందుగానే పరిష్కరించుకున్నామని, కక్షిదారులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా కేసుల పరిష్కారాణికై జిల్లా న్యాయసేవాధికార సంస్థ లోక్ అధాలత్లను నిర్వహిస్తుందన్నారు. ఎన్నో సంవత్సరాల కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమవుతున్నాయని, కక్షిదారులు రాజీమార్గాన్ని అవలంభించాలని ఆయన అన్నారు.. ఇప్పటికే కేసు నమోదు చేసుకొని లోక్ అదాలత్ ద్వారా రాజీపడి కేసులు పరిష్కరించుకున్న లావణ్య-మహేష్ దంపతులను, రాగం శ్రీను- దశరథంను రోడ్డు ప్రమాదంలో మరణించి భీమా కంపెనీ నుండి పరిహారం పొందిన కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పుష్పాలు అందించి. అభినందించారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదంలో గాయపడి లోక్ అదాలత్‌కు రాలేని స్థితిలో ఉన్న రామ్మోహన్రావు కేసును ఆన్లైన్ ద్వారా కక్షిదారునితో మాట్లాడి పరిష్కరించిన న్యాయవాదులను జిల్లా ప్రధాన న్యాయమూర్తి అభినందించారు.

న్యాయమూర్తులు ఆర్. దేనీరూధ్, మహ్మద్ అఫ్రోజ్ అక్తర్, ఎం.శ్యాం, కె. అరుణకుమారి, ఎన్. అనితారెడ్డి, ఎం. ఉషశ్రీ, రుబినా ఫాతిమా, ఎస్.శాంతిసోని, పి. మౌనిక, ఎన్.హెచ్ హైమపూజిత, బార్ అసోసియోషన్ కార్యవర్గ సభ్యులు కోనా చంద్రశేఖర్, ఇమ్మడి లక్ష్మీనారాయణ, గురుమూర్తి, సంపత్, తదితరులు పాల్గొన్నారు..

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Share This Post