సమన్వయంతో అధికారులు బాధ్యతాయుతంగా పని చేసి ప్రగతి సాధించాలి…

ప్రచురణార్ధం

సమన్వయంతో అధికారులు బాధ్యతాయుతంగా పని చేసి ప్రగతి సాధించాలి…

మహబూబాబాద్, 2021 డిసెంబర్ -03:

అధికారులు, సిబ్బంది సమన్వయంగా పని చేసినప్పుడు అనుకున్న ప్రగతిని అలవోకగా సాధించవచ్చని రాష్ట్ర షెడ్యూల్ కులముల అభివృద్ధి శాఖ కమీషనర్ డాక్టర్ యోగితా రాణా తెలిపారు.

శుక్రవారం కలెక్టరేట్ ప్రగతి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ శశాంకతో కలిసి సంక్షేమ హాస్టల్స్, పోస్ట్, ప్రి మెట్రిక్ స్కాలర్షిప్ లపై ములుగు, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలకు చెందిన అధికారులతో సమీక్షించారు.

మహబూబాబాద్ జిల్లాకు మంజూరు చేసిన ఒక కోటీ నిధుల నుండి సుమారు 94 లక్షలు ఖర్చు చేయడం జరిగిందని, మిగులు నిధులు కూడా సద్వినియోగం చేసుకోవాలన్నారు.

వసతి గృహాలలో బయో మెట్రిక్ లు పని చేయటం లేదని, వెంటనే మరమ్మత్తులు చేయించి హాజరు ను నమోదు చేయాలని, హాస్టల్ పిల్లలకు అన్ని సౌకర్యాలు కల్పించి సొంత ఇంటిలో ఉన్నామనే భావన కలిగించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పిల్లలు మాస్క్ లు ధరించే విధంగా, సానిటైజేషన్ చేసుకునే విధంగా పర్యవేక్షించాలన్నారు.

ప్రతి హాస్టల్ లో మెష్ డోర్ లు తప్పనిసరిగా ఏర్పాటు. చేయాలని, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారం అందే విధంగా ప్రతి రోజూ రాగి లడ్డు , పల్లి పట్టి లు అందించాలన్నారు.

పౌష్టికాహారం ను స్వయం సహాయక సంఘాలచే తయారు చేయించాలని సూచించారు.

హాస్టల్ కొన్ని సోషల్ సైన్స్, diagrams, తెలంగాణ రాష్ట్రానికి సంబందించిన వివరాలతో కూడిన చార్ట్ లు, విజ్ఞానానికి సంబందించిన స్లోగన్స్ ఏర్పాటు చేయాలన్నారు.

పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ మరమ్మతుల పనులు పూర్తి అయిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

వసతి గృహాల నిర్వహణ లోపాలను సవరించుకుంటు సమన్వయం పెంచుకుంటూ . ఎట్టి పరిస్థితు లలోనూ ప్రతి రోజు బయో మెట్రిక్ హాజరు నమోదు చేయలని ఆదేశించారు.

HWO లు తమకు కేటాయించిన స్కూల్ కు సంబందించి పోస్ట్, ప్రి మెట్రిక్ scholarships అందేలా పిల్లల తల్లిదండ్రుల తో మాట్లాడి scholarship అందే విధంగా చూడాలన్నారు. HWO కు కేటాయించిన టార్గెట్ లను పూర్తి చేయాలన్నారు. పేద కుటుంబాల వారికి scholarship అందే విధంగా చూసి సహాయ పడాలని అన్నారు.

2017-18, 2018-19, 2020-21 సంవత్సరాలకు సంబందించి కాలేజ్ పెండింగ్ పోస్ట్ మెట్రిక్ scholarship ల కొరకు డిసెంబర్ 15వ తేదీ లోగా పూర్తి చేయాలన్నారు.

ePASS వెబ్ సైట్ లోకి వెళ్లి ఆన్లైన్ లో renewal, registration ను కాలేజ్ వారీగా ఎంత మంది చేసుకోలేదు పరిశీలించి వెంటనే చేయించాలన్నారు.

నాలుగు జిల్లాలకు సంబందించి జిల్లాల వారీగా పోస్ట్, ప్రే మెట్రిక్ పై సమీక్షించారు. కులాంతర వివాహాలకు సంబందించి పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు లలో FIR రిజిస్టర్ అయిన వాటికి రిలీఫ్ ఎంత వరకు అందినవి అడిగి తెలుసుకున్నారు.

జిల్లా కలెక్టర్ లు, అధికారులు హాస్టల్ లను తనిఖీ చేయలని, తనిఖీ సందర్భంలో తప్పని సరిగా కిచెన్, స్టోర్ రూం లను పరిశీలించాలని సూచించారు.

సొంత ఇంటి భావన కలిగేలా వసతి గృహాల నిర్వహణ బాధ్యత లు తీసుకోవాలని విద్యార్థులతో పాటు సిబ్బందికి అవగాహన కల్పించి మంచి వాతావరణం కల్పించాలన్నారు.

హాస్టల్ లో ఉన్న ప్రతి వస్తువు ఎక్కువ కాలం మన్నిక చెందేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

పరిశుభ్ర వాతావరణంతో పాటు వసతి గృహాలకు అవసరమయ్యే కరివేపాకు,ఉసిరి, నిమ్మ, జామ వంటి మొక్కలను పెంచాలన్నారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ హన్మంతు నాయక్, ఉప సంచాలకులు రమాదేవి, నాలుగు జిల్లాలకు చెందిన ఎస్సీ కార్పొరేషన్ ఈ.డి.లు, ASWO, HWO లు, తదితరులు పాల్గొన్నారు.

——————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post