సమన్వయంతో పనులు చేపట్టాలి…

ప్రచురణార్ధం

సమన్వయంతో పనులు చేపట్టాలి…

మహబూబాబాద్, అక్టోబర్,11.

జిల్లాలో చేపట్టే అభివృద్ధి పనులను సమన్వయంతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

సోమవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో నూతన కలెక్టర్ కార్యాలయ భవన సముదాయం, మెడికల్ కళాశాల పనులు ప్రభుత్వ భూముల పరిరక్షణ లపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షించారు.

మెడికల్ కళాశాల పనులపై సమీక్షిస్తూ స్థలమ్యాప్ ను పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలన్నారు. నూతన కలెక్టర్ కార్యాలయం భవన సముదాయపు పనులు వేగవంతం చేయాలని, అవసరం లేని నిర్మాణాలు తొలగించాలన్నారు. విద్యుత్, త్రాగునీటి నీటి కనెక్షన్ల కొరకు సంబంధిత అధికారులకు లేఖలు వ్రాయాలన్నారు. పనులు ప్రణాళికా బద్దంగా ఉండాలన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ కొమరయ్య, ఆర్.అండ్.బి ఏక్సిక్యూటివ్ ఇంజినీర్ తానేశ్వర్, డిప్యూటీ ఏక్సిక్యూటివ్ ఇంజినీర్ రాజేందర్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏ. డి. నరసింహమూర్తి, తహసీల్దార్ రంజిత్, సర్వేయర్స్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
———————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం,మహబూబాబాద్ వారిచే.జారిచేయనైనది.

Share This Post