సమన్వయంతో పనులు చేపట్టాలి.

ప్రచురణార్థం

సమన్వయంతో పనులు చేపట్టాలి.

మహబూబాబాద్ నవంబర్, 16.

భారత రైల్వే జాతీయ హైవే పనులను సమన్వయంతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో భారత రైల్వే మూడవ లైను భూసేకరణ పనులతోపాటు, జాతీయ రహదారి 365 కురవి నుండి ఖమ్మం, మరొక జాతీయ రహదారి 930 వలిగొండ నుండి తొర్రూరు, 163 జాతీయ రహదారి జిల్లా మీదుగా నాగపూర్ నుండి మచిలీపట్నం వరకు నిర్మించనున్న ప్రాజెక్టు పనులను సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.

ముందుగా రైల్వే ప్రాజెక్ట్ మూడవ లైన్ పై కలెక్టర్ సమీక్షిస్తూ అమ్మపాలెం డోర్నకల్ ఒక ఎకరం తొమ్మిది కుంటల భూసేకరణ వేగవంతం చేసి నివేదికలు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.

జాతీయ రహదారులపై సమీక్షిస్తూ సర్వే ఫారెస్ట్ అధికారులు నీటిపారుదల విద్యుత్ రెవెన్యూ అధికారులు సమన్వయంతో సంయుక్తంగా భూసేకరణ పనులు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ కొమరయ్య సర్వే ఫారెస్ట్ రెవెన్యూ జాతీయ రోడ్లు భవనాల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు
————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post