సమన్వయంతో ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నిక – కలెక్టర్

రెండు జిల్లాల పరిధిలోని అధికారులు సమన్వయంతో పనిచేసి ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఇక్కడ కూడా కవర్ తన నియమాలు అతిక్రమణ జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కోరారు.

ఉమ్మడి జిల్లా పరిధిలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి గురువారం నాడు నిజామాబాద్ కామారెడ్డి జిల్లా ల సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, కామారెడ్డి sp శ్వేత, నిజామాబాద్ అడిషనల్ డిసిపి అరవిందు, రెండు జిల్లాల పరిధిలోని ఏ సి పి లు, డీఎస్పీలు, ఆర్డీవో లు, జిల్లా పరిషత్ సీఈఓ లతో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత సంవత్సరమే ప్రశాంతంగా ఎన్నిక నిర్వహించిన అనుభవం మనందరికీ ఉన్నదని రెండు జిల్లాల అధికారులు సమన్వయంతో ఈసిఐ జారీచేసిన ఆదేశాల ప్రకారం పకడ్బందీగా విధులు నిర్వహించాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రతి ఒక్కరూ పాటించే విధంగా గట్టి బందోబస్తు, పర్యవేక్షణ ఉండాలన్నారు. ఈరోజు సాయంత్రం కల్లా పబ్లిక్ ప్లేసెస్ లో రాజకీయపరమైన ఫ్లెక్సీలు కానీ, బ్యానర్లు కానీ, రాతలు కానీ ఉంటే పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలను కూడా ఉంటే తొలగించాలని ఎక్కడ కూడా ఎమ్ సి సి అతిక్రమణ జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఇండోర్, అవుట్ డోర్ సమావేశాలకు అనుమతి ఇవ్వవచ్చని కానీ ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. సమావేశాలకు సంబంధిత రెండు జిల్లాల పరిధిలోని ఆర్ డి వో లు దరఖాస్తులు వస్తే తీసుకొని సంబంధిత పోలీస్ అధికారులతో సంప్రదించి చర్చించి అనుమతులు జారీ చేయాలన్నారు. సమావేశాలకు అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలని అనుమతుల జారీ విషయంలో ఆలస్యం జరగకుండా చూడాలన్నారు.
ఎమ్ సి సి పకడ్బందీగా అమలు జరపడానికి ఎస్ ఎస్ టి e pan card టీమ్లను వెంటనే రెండు జిల్లాల్లో నియమించి మండల స్థాయిలో ఎమ్ సి సిలు వెంటనే విధులు ప్రారంభించాలని పేర్కొన్నారు. నోటిఫికేషన్ జారీ చేసే నవంబర్ 16వ తేదీ నుండి అన్ని స్థాయిల్లో అందరూ అధికారులు అన్ని టీములు వారి విధులు నిమగ్నం కావాలని, ఎక్కడ కూడా ఫిర్యాదులకు అవకాశం లేకుండా చూడాలన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో బార్డర్ ల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అవసరమైన తనిఖీలు చేయాలన్నారు. నవంబర్ 16 నుండి ఆయా టీమ్ లకు సంబంధించి పట్టుకున్న, సీజ్ చేసిన, ఇతర వివరాలను ప్రతిరోజు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.

ఎంపీటీసీలు జడ్పీటీసీలు మున్సిపాలిటీ సభ్యులతో కూడిన ఓటర్ల జాబితాలో మున్సిపాలిటీల ఎక్స్ అఫిషియో సభ్యులు కూడా ఓటర్లుగా అర్హత కలిగి ఉంటారని ప్రస్తుతం 824 మంది ఓటర్లుగా ఉన్న జాబితాలో నలుగురు చనిపోయినారని, ఒకరిని అనర్హులుగా ప్రకటించారని తెలిపారు.

బ్యాలెట్ పేపర్ తోనే ఎన్నిక ఉంటుందని రెండు జిల్లాల పరిధిలోని ఆరు డివిజన్ల హెడ్ క్వార్టర్ లలో ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని వసతులున్న, అనుకూలంగా ఉన్న పోలింగ్ స్టేషన్ ను ఎంపిక చేయాలని సూచించారు. వచ్చే సోమవారం నాడు ఎన్నికల సిబ్బందికి శిక్షణ అందించాలన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది తప్పనిసరిగా రెండు విడతల వ్యాక్సినేషన్ తీసుకొని ఉండాలని ఆ విషయం నిర్ధారించుకోవాలి అన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు చిత్రా మిశ్రా, చంద్రశేఖర్ ర్ డి పి వో జయసుధ జిల్లా పరిషత్ సీఈవో గోవిందు, డి టి సి వెంకటరమణ, డి సి ఓ సింహాచలం, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post