సమన్వయంతో వ్యాక్సినేషన్ లక్ష్యం పూర్తి చేయాలి:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, అక్టోబర్ 13: వైద్య ఆరోగ్య, పంచాయతీ రాజ్ శాఖలు సమన్వయంతో పనిచేసి, వ్యాక్సినేషన్ లక్ష్యం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం కలెక్టర్ జఫర్ ఘడ్ మండల కేంద్ర ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, రేగడి తాండా లోని సబ్ సెంటర్ల ఆకస్మిక తనిఖీ చేసి, వాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలంలో వాక్సినేషన్ పూర్తి చేయుటకు అన్ని వసతులు ఉన్నాయని, 100 శాతం వాక్సినేషన్ త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. మండల ప్రత్యేక అధికారి, ఎంపిడివో, వైద్యాధికారులు, ఎంపీవో, ఏపీఎం, సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో గ్రామాలలో స్వయముగా సందర్శించి ప్రజలకు వ్యాక్సిన్ ప్రాముఖ్యతను తెలిపి, కరోనా నియంత్రణకై వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని వారిని చైతన్య పరచాలని అన్నారు. పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడి టీచర్ లు, ఐకెపి సీఏలు, ఐకెపి సిసిల సహాయముతో అందరు సమిష్టి కృషి చేసి ప్రజలు వ్యాక్సిన్ తీసుకొనేలా ప్రేరేపించాలన్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకు ప్రత్యక్షముగా ప్రజలను ప్రేరేపించాలని కలెక్టర్ ఆదేశించారు. మండలములోని వైద్యాధికారులు ప్రతి నెల మండలములో జరిగే ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరిగే విధముగా ప్రజలకు అవగాహనా కల్పించాలని, ప్రతి నెల , ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో 20 ప్రసవాలు అయ్యే విధముగా కృషిచేయాలని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఏ. మహెందర్,మండల ప్రత్యేక అధికారి రాజేంద్రప్రసాద్, ఎంపిడివో శ్రీధర్ స్వామి, వైద్యాధికారులు డా. రాజు, డా. మురళి, ఎంపీవో పాక శ్రీనివాస్, అధికారులు, తదితరులు తదితరులు వున్నారు
——————————————————————————————————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post