సమయపాలన పాటిన్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

వైద్యాధికారులు నమయపాలన పాటిన్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. గురువారం తాండూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ వైద్యాధికారులు తప్పనినరిగా నమయపాలన పాటించాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగుల పట్ల సేవాభావంతో మెలగాలని తెలిపారు. అనంతరం తాండూర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని పల్లెప్రకృతి వనంను నందర్శించి వనం నిర్వహణపై తాండూర్‌ ఇన్బార్జి నర్చంచ్‌ నవీన్‌ కుమార్‌, కార్యదర్శి తపాన్‌ పై ఆగ్రహం వెలిబుచ్చారు. అనంతరం కిష్టంపేట గ్రామపంచాయతీ పరిధిలో గల పల్లె ప్రకృతి వనాన్ని నందర్భించి నిర్వహణ లోపంపై కార్యదర్శి, నర్చంచ్‌లపై ఆగ్రహం వెలిబుచ్చారు. ప్రభుత్వం ప్రజల కోసం చేపడుతున్నపల్లె ప్రకృతి వనం నిర్వహణలో అలనత్వం, నిర్లక్ష్యం వహిస్తే తగు చర్యలు తీనుకోవడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తాండూర్‌ తహశిల్దార్‌ కవిత, ఇన్బార్జి మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి వేణుగోపాల్‌, ఆర్‌.ఐ.
ఎజాజొద్దిన్‌, మండల విద్యాధికారి ప్రభాకర్‌, నంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post