సమస్త ఓటరు వివరాలు మొబైల్ యాప్ లో – జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి.

సమస్త ఓటరు వివరాలు మొబైల్ యాప్ లో – జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి.
ఒక ఓటరు కు కావాల్సిన అన్ని వివరాలు మొబైల్ యాప్ లో చూసుకోవచ్చని, ప్రజాస్వామ్య పారదర్శకత కై భారత ఎన్నికల సంఘం ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ను రూపొందించినట్లు కలెక్టర్ తెలిపారు. బుధవారం ఉదయం కలెక్టర్ తన ఛాంబర్ లో ఓటర్ హెల్ప్ లైన్ యాప్ గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ కొత్త ఓటర్ గా పెరు నమోదుకు గాని, ఓటరు ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుండి వేరే నియోజకవర్గానికి మారినప్పుడు కేవలం మొబైల్ యాప్ లో నమోదు చేసుకునే సులువైన యాప్ ను ఎన్నికల సంఘం విడుదల చేసిందన్నారు. చనిపోయిన వారి పేర్లు ఓటరు జాబితా నుండి తొలగించేందుకు ఫారం 8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తమ పేర్లు జాబితాలో ఉన్నాయా లేవా అనే వివరాలు సైతం చూసుకోవచ్చన్నారు. యువకులు ఈ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని అర్హులైన ప్రతి ఒక్కరు తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని సూచించారు.
అదనపు కలెక్టర్ కె.చంద్రా రెడ్డి, జడ్పి సి.ఈ.ఓ సిద్ధిరామప్ప, ఇతర జిల్లా అధికారులు పోస్టర్ ఆవిష్కరణలో పాల్గొన్నారు.

Share This Post