సమస్యను పరిష్కరించాలని తెలియచేస్తూ ప్రజావాణిలో ఇచ్చిన ప్రతి ధరఖాస్తును పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు

. సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి సమస్యల యొక్క వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులను పరిష్కరించేందుకు సంబంధత శాఖల అధికారులకు ఎండార్స్ చేయడం జరిగిందని, అట్టి ప్రజా దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలన చేసి పిర్యాదు దారునికి లిఖితపూర్వకంగా తెలిచేయాలని చెప్పారు. కాలయాపన చేయక సమస్య పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రజావాణిలో సమస్యను పరిష్కరించాలని ప్రజలు అందచేసిన దరఖాస్తులు కొన్ని: కొత్తగూడెం మండలం, మేదరబస్తీకి చెందిన బొల్లెద్దుల సుబ్బలక్ష్మి తన కుమారుడు నవీన్ కుమార్ మే 18వ తేదీన కోవిడ్ వ్యాధితో మరణించాడని, వయోవృద్ధులైన మమ్ములను పోషించే వారు లేక అనాధలమయ్యామని, ఇటీవల ఇంట్లో జరిగిన ప్రమాదంలో తన భర్త కుడిచేయి విరిగినదని, పోషణ కొరకు ఆర్ధిక సాయం అందించాలని చేసిన దరఖాస్తును ఆర్థిక సాయం మంజూరుకు కలెక్టరేట్ ఓఎస్టీకి సిఫారసు చేశారు. పినపాక మండలం, వెంకట్రావుపేట గ్రామానికి చెందిన మాటూరి చిన వెంకయ్య జూలై నెలలో వచ్చిన తుఫాను వల్ల తన ఇల్లు పూర్తిగా పాడైపోయినదని, కడు దుర్భర పరిస్థితుల్లో ఉన్న నేను నివసించుటకు ఇల్లు లేక చెట్టు క్రిందనే నివాసం ఉంటున్నానని, తన పరిస్థితిని తెలియచేస్తూ తహసిల్దార్కు దరఖాస్తు చేసియున్నానని, నేటి వరకు ఎటువంటి పరిహారం అందలేదని, తనకు ఆర్థిక సాయం అందించు విధంగా చర్యలు తీసుకోవాలని దరఖాస్తు చేశారు. ప్రగతినగర్, కొత్తగూడెంనకు చెందిన శ్రీరామోజు అనురాధ నిరుపేద కుటుంబానికి చెందిన వారమని, ఉండటానికి ఇల్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని, తమ పరిస్థితిని గమనించి రెండు పడక గదుల ఇల్లు మంజూరు చేయాలని చేసిన దరఖాస్తు చేయగా తగు చర్యలు నిమిత్తం డిఆర్డిఓకు ఎండార్స్ చేశారు. దుమ్ముగూడెం మండలం, సీతానగరం గ్రామానికి చెందిన పొడియం రమేష్ సర్వే నెం. 76/11అ, 76/12లలో గల భూమిని పొడియం లక్ష్మయ్యకు బహుమానంగా పొడియం బుచ్చమ్మ ఇచ్చుటకు అంగీకరించినందున ఆగష్టు 28వ తేదీన మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసియున్నామని, నేటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదని, కావున పట్టామార్పిడి చేయాల్సిందిగా చేసిన దరఖాస్తును తగు చర్యలు తీసుకోవాలని తహసిల్దార్కు సిఫారసు చేశారు. చంద్రుగొండ మండలం, అయ్యన్నపాలెం గ్రామానికి చెందిన కొండ్రు సుజాత దివ్యాంగులు పించను మంజూరు చేసిన దరఖాస్తును ఆన్లైన్లో పరిశీలించాలని, డిఆర్డిఓకు సూచించగగా దివ్యాంగుల పింఛను మంజూరుకు ఆమె చేసిన దరఖాస్తు మంజూరు కావాల్సి ఉందని, ప్రభుత్వం దివ్యాంగుల పించన్లు మంజూరు చేయగానే ఆమెకు “పించను వస్తుందని చెప్పారు. రేగళ్ల గ్రామ రైతులు పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరుకు 30-6-2021 న చేసిన దరఖాస్తును విచారణ నిర్వహించాలని, ఆర్డీఓకు సూచించారని, నేటి వరకు అధికారులు విచారణ నిర్వహణకు రాలేదని, కావున సత్వరం పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చేయు విధంగా చర్యలు తీసుకోవాలని దరఖాస్తు చేశారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో డిఆరో అశోకచక్రవర్తి, డిఆర్డిఓ మధుసూదన్ రాజు, డిపిఓ రమాకాంత్, సిఈఓ విద్యాలత తదితరులు పాల్గొన్నారు.

Share This Post