సమస్యలకు సత్వరమే పరిష్కారం చూపాలి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ ముజమ్మిల్ ఖాన్


సమస్యలకు సత్వరమే పరిష్కారం చూపాలి

జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ ముజమ్మిల్ ఖాన్

——————————
సిద్దిపేట 04, ఏప్రిల్ 2022:
——————————

ప్రజావాణి సమస్యలపై అధికారులు సత్వర పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు.

సిద్దిపేట సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించి మాట్లాడారు.

ప్రజావాణి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు ఆర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు.
పెండింగ్ అర్జీల పై అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి మిషన్ మోడ్ లో అన్నింటినీ పరిష్కరించాలని అన్నారు.

అలాగే అధికారులు అందరూ విధిగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి తప్పక హాజరు కావాలని జిల్లా అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. ముందస్తు అనుమతి లేకుండా ప్రజావాణి కి గైర్హాజరైన, ఆర్జీల పరిష్కారంలో అలసత్వం వహించిన చర్యలు తప్పవని జిల్లా అదనపు కలెక్టర్ హెచ్చరించారు.

జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ…..
భూ సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజావాణి లో వచ్చే ఫిర్యాదులు, వినతుల పై
రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి పరిష్కారం చూపాలన్నారు. వీటితో పాటు భూ సమస్యల పరిష్కారం కోసం నేరుగా ధరణి కి వచ్చే దరఖాస్తుల పరిష్కారం పై ప్రత్యేక శ్రద్ద పెట్టీ పరిష్కారం చూపాలన్నారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు జరిపే మహనీయుల జయంతులు, వర్దంతుల కార్యక్రమాలలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలని ఆదేశించారు. తమ జిల్లా, డివిజన్, మండల కార్యాలయాలలో జయంతులు, వర్దంతుల కార్యక్రమాలను నిర్వహించి వారి త్యాగలను స్మరించుకోవాలాన్నారు.

జిల్లాలోని విద్యార్ధులను కూడ ఈ కార్యక్రమాలలో భాగస్వామ్య లను చేయాలన్నారు. ఆ రోజు సెలవు దినంగా ప్రకటిస్తే…. ప్రభుత్వ పాఠశాల ఉపాద్యాయులు తమ పాఠశాల లో జయంతులు, వర్దంతుల కార్యక్రమాలను నిర్వహించి మహనీయులకు నివాళులు అర్పించాలని సూచించారు.

ధరణీ కి వచ్చే అర్జీలను వెనువెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులకు సూచించారు.

భూ సంబంధిత సమస్యలు, ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తం 37 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి.
ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలను స్వీకరించిన జిల్లా అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులకు పంపించి సత్వర పరిష్కారం చేయాల్సిందిగా సూచించారు.

ప్రజావాణి లో శిక్షణ కలెక్టర్ శ్రీ ప్రపుల్ దేశాయ్
జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ బి చెన్నయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
——————————
డీ.పీ.ఆర్.ఓ, సిద్ధిపేట కార్యాలయంచే జారీ చేయనైనది.

Share This Post