సమస్యలను ఓపికగా వింటూ .. పరిష్కారం చూపుతూ.. రాష్ట్ర ఐ. టి. శాఖ మంత్రి కే. తారకరామారావు

 

*సమస్యలను ఓపిగ్గా వింటూ….*
*పరిష్కారం చూపుతూ…*

– అవతరణ వేడుకల అనంతరం IDOC లో పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతుల స్వీకరించిన మంత్రి శ్రీ కే టి ఆర్.

– ప్రజల సమస్యల పట్ల మంత్రికి ఉన్న చిత్తశుద్ధిని అభినందిస్తున్న ప్రజలు.

 

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో రాష్ట్ర అవతరణలో పాల్గొన్న అనంతరం అధికారులు ఏర్పాటు చేసిన తేనీటి విందు లో
రాష్ట్ర మంత్రి శ్రీ కే తారక రామారావు పాల్గొన్నారు.

ఈ సమయంలో ప్రజలు మంత్రిని కలిసేందుకు పెద్ద సంఖ్యలో IDOC కి వచ్చారు.
బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలు నిరాశ చెందకుండా ప్రతి ఒక్కరి నుండి విజ్ఞప్తులను స్వీకరించారు. సమస్యలకు ఓపిగ్గా అడిగి తెలుసుకున్నారు.

సమస్యలను పరిష్కరించవలసిందిగా అక్కడే వున్న జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అధికారులను అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్ర అవతరణ వేడుకల్లో బిజీగా ఉన్నప్పటికీ తమ విజ్ఞప్తులను స్వీకరించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ప్రజల సమస్యల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధిని ప్రజలు అభినందిస్తున్నారు.

 

Share This Post