ప్రచురణార్థం……2

తేదిః 05-11-2021
సమస్యల పరిష్కారం కై సత్వర చర్యలు తీసుకోవాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి
జగిత్యాల, నవంబర్ 05: వివిధ రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారం కొరకు వచ్చే ధరఖాస్తులపై అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. శక్రవారం వివిధ రెవెన్యూ సంబందిత అంశాలపై జూమ్ వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షిచారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, కల్యాణలక్ష్మీ, షాదిముబారక్ లబ్దిదారుల నుండి వచ్చిన ధరఖాస్తులపై చర్యలు తీసుకోవాలని, శాసన సభ్యుల అనుమతుల కొరకు పంపించిన వాటి పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటు చర్యలు తీసుకోవాలని, వివిధ దృవీకరణల జారి కొరకు వచ్చిన ధరఖాస్తులపై నిర్దారణకు వచ్చిన తరువాత చర్యలు తీసుకోవాలని, బిఆండ్ ఎస్.ఎల్.ఏ, ప్రజావాణి ధరఖాస్తులపై చర్యలు తీసుకోవడంలో అలస్యం జరగకుండా చూడాలని తెలియచేసారు.
పెండింగ్ మ్యూటేషన్ లపై చర్యలు తీసుకోవడంలో అలస్యం జరగకుండ సమీక్షించి చర్యలు తీసుకోవాలని, భూ సమస్యలపై వచ్చే ధరఖాస్తులపై చర్యలు తీసుకోవాలని, పెండింగ్ మ్యూటేషన్ ధరఖాస్తులపై సమీక్షించి చర్యలు తీసుకోవాలని, పిఓబి లపై వచ్చే ధరఖాస్తులపై చర్యలు తీసుకొని, తదుపరి చర్యలకు పై అధికారులకు పంపించాలని, ఈ ఆఫీస్ ఫైళ్లపై తదుపరి చర్యలు తీసుకోవడం వలన అలస్యం జరగకుండా చూడగలుగుతామని పేర్కోన్నారు.
మని లాండర్స్ లైసెన్సు ఇచ్చిన విధంగా జరుగుతున్నాయ సమీక్షించాలని, రెన్యూవల్ చేయరాదని, ఇటువంటి వాటిపై చర్యలు తీసుకోడంలో జాగ్రత్త వహించాలని సూచించారు. గ్రామం, మండలంలో కోర్టు స్టే ఉన్నవాటిపై క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి ప్రభుత్వ, పట్టా మరియు వివిధ భూములపై పూర్తిస్థాయి అవగాహనకు వచ్చిన తరువాత మాత్రమే చర్యలు తీసుకోవాలని, పోలింగ్ కేంద్రం వారిగా చర్యలు తీసుకోవాల్సిన అంశాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని, బిఎల్ఓబి స్థాయి అధికారులతో సమావేశాలను నిర్వహించాలని సూచించారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ శ్రీమతి జె. అరుణశ్రీ, ఆర్డిఓలు, వివిధ మండలాల తహసీల్దార్లు పాల్గోన్నారు.
జిల్లా పౌరంసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది