ప్రచురణార్థం
మహబూబాబాద్ నవంబర్ 28.
ప్రజాసమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.
సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రగతి సమావేశ మందిరంలో గ్రీవెన్స్ డే పురస్కరించుకొని ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి పలు విజ్ఞప్తులు స్వీకరించారు.
ఈ సందర్భంగా మహబూబాబాద్ పట్టణానికి చెందిన వితంతువు గంగరబోయిన అనూష తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని తన భర్త ఆకస్మికంగా అనారోగ్యంతో చనిపోవడంతో పోషణ కు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వితంతు పింఛన్ మంజూరు చేయాలని దరఖాస్తు అందించారు.
నరసింహుల గూడెం మండలం పడమటి గూడేనికి చెందిన దాస రోజు సత్యనారాయణ తన దరఖాస్తు అందిస్తూ తాను చిన్నతనం లోనే పోలియోతో దివ్యాంగుడిగా మారానని అయినా ఆత్మ స్థైర్యంతో విద్యను అభ్యసించి ప్రైవేట్ టీచర్ గా పని చేయడం జరిగిందని, ఇటీవల జరిగిన ప్రమాదంలో కాలు విరిగిందని తద్వారా ఏ పని కొరకు పోలేక కులవృత్తి కార్పెంటర్ గా జీవనం కొనసాస్తున్నానని తనకు బ్యాటరీ సైకిల్ మంజూరు చేయించాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.
మహబూబాబాద్ మున్సిపల్ పరిధి ఏడవ వార్డు లోని సలార్ తండా కు చెందిన ఆంగోత్ విజయలక్ష్మి భాయ్ తన దరఖాస్తు అందిస్తూ తనకు రెండు పడకల గదుల ఇల్లు, మూడు ఎకరాల భూమి, ఐటీడీఏ ద్వారా రుణ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తిని అందించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రజల సమస్యలను సాధ్యమైనంత మేరకు త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, రెవెన్యూ అదనపు కలెక్టర్ డేవిడ్, కలెక్టర్ కార్యాలయం ఏవో వెంకటరమణ జిల్లా అధికారులు పాల్గొన్నారు.