సమస్యల పరిష్కార వేధికగా జిల్లా సర్వసభ్యసమావేశం :: జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి దావ వసంత

పత్రికాప్రకటన

సమస్యల పరిష్కార వేధికగా జిల్లా సర్వసభ్యసమావేశం :: జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి దావ వసంత

తేదిః 03-10-2021
సమస్యల పరిష్కార వేధికగా జిల్లా సర్వసభ్యసమావేశం :: జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి దావ వసంత
జగిత్యాల, అక్టోబర్ 03: మండలాల్లో జరిగే అభివృది పనులలో ఎదురయ్యే సమస్యలపై పరిష్కార వేదికగా సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి దావ వసంత అన్నారు. జిల్లాలో చేపట్టే అభివృద్ది పనులలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషిచేయాలని, సమావేశంలో జిల్లాలో చేపడుతున్న అభివృద్ది పనులపై ఎదురయ్యే సమస్యలపై కులంకశంగా చర్చించుకుని వాటి పరిష్కారం దిశగా కృషిచేయాలని, సమావేశం ద్వారా చర్చకు వచ్చిన సమస్యలు పునరావృతం కాకుండా అధికారులు చూడాలని, అధికారులందరు ప్రోటోకాల్ పాటించాలని, జిల్లాస్థాయి అధికారులు క్షేత్రస్థాయి పర్యటలను చేపట్టె సమయంలో ప్రజాప్రతినిధులకు సమాచారాన్ని అందించాలని, రాష్ట్ర ఆవిర్బావం అనంతరం ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, లోటుపాట్లను నివృత్తి చేసుకొని అభివృద్దిలో ముందుండడం జరిగిందని, పంటమార్పిడిని గురించి రైతులకు అవగాహన కల్పించేలా అధికారులు దృష్టి సారించాలని, ప్రభుత్వ పథకాలన్ని ప్రజలకు చేరేలా అందరు బాద్యతగా వ్యవహరించి సమన్వయంతో ముందుకు సాగాలని పేర్కోన్నారు. కరోన కారణంలో పాఠశాలలను మూసివేసి ఇప్పుడిప్పుడే ప్రారభించుకుంటున్న తరుణంలో పాఠశాలల్లో ప్రత్యేక సానిటేషన్ కార్యక్రమాలను చేపట్టాలని, చేపట్టే పనులలో ప్రమాణనాణ్యతలను తప్పక పాటించాలని పేర్కోంటు, టిటిడి బోర్డు సభ్యునిగా ఎన్నికైన కోరుట్ల శాసన సబ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారికి శుభాకాంక్షలను తెలియజేశారు.
జిల్లా కలెక్టర్ జి. రవి మాట్లాడుతూ, పంటమార్పిడిపై జిల్లాలోని 71 రైతువేదిక క్లస్టర్ లలోని ఎఈఓల ఆద్వర్యంలో రైతుబందు కోఆర్డినేటర్లు, గ్రామ కమిటి మెంబర్లతో రైతులకు అర్థమయ్యే విధంగా అవగాహన సదస్సులను ఏర్పాటు చేయాలని, జిల్లాలో ఉద్యానవన శాఖ ద్వారా మొదటి విడతో ఆయిల్ ఫాం సాగుచేసేలా గొల్లపెల్లి మండలం అబ్బాపూర్ గ్రామంలో ఎజెన్సి గుర్తించుకొని 20ఎకరాల స్థలాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగి, ప్లానిటేషన్ కొరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అయిల్ ఫాంపై సానుకులంగా ఉన్నరైతుల శిక్షణ నిమత్తం ప్రతిజిల్లాకు 10లక్షలు ప్రభుత్వం మంజూరు చేసిందని, అయిల్ ఫాం సాగుపై అవగాహన నిమిత్తం పూర్వ ఖమ్మం జిల్లాలోని అశ్వరావు పేట, సత్తుపల్లి ప్రాంతాలలో వ్యవసాయశాఖ, ఉధ్యానవన శాఖ అధికారులను ఈనెల 7వ తేదిన పంపించి అక్కడి రైతులు సాగులో చేపడుతున్న మెలకువలను తెలుసుకునేలా రెండురోజుల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని పేర్కోన్నారు. అనంతరం రెండవ విడతలో అయిల్ ఫాం సాగుపై సానుకులంగా ఉన్న రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడం జరుగుతుందని పేర్కోన్నారు. అభివృద్ది పనులలో ప్రభుత్వ ఆదేశాలను పాటించని వారందరిపై చర్యలు తీసుకుంటామని, జిల్లాలో ప్రగతి పనులతో వివిధ అభివృద్ది పనులలో జిల్లా మంచిస్థానంలో ఉందని, జిల్లాలో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులు 85శాతం బిల్లులు ఎఫ్టిఓలు నమోదు పూర్తిచేయడం జరిగిందని, త్వరలో చెల్లింపులు కూడా జరుగుతాయని పేర్కోన్నారు. ఋణమాఫీలు రైతులకు చేరవేయడంలో బ్యాంకు అధికారులతో పాటు వ్యవసాయ అధికారులు కృషి చేసి లబ్దిదారులకు ఋణమాఫీ అందేలా చేయడంతో పాటు, సంబంధిత సమాచారాన్ని తెలియజేయాలని సూచించారు. మత్స్యశాఖ ద్వారా చేపట్టిన చేపపిల్లల పంపిణిలో గుత్తేదారులు పనిసక్రమంగా లేకపోవడంతో పాత కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చేపపిల్లలను ప్రభుత్వం ద్వారానే సమకూర్చడం జరిగిందని, ఎక్కడైన పంపిణిచేసిన చేపపిల్లలు చనిపోయినట్లయితే పునరుద్దరిస్తామని పేర్కోన్నారు. పాఠశాలల వారిగా చేపట్టే మద్యాహ్న భోజన పథకంపై యం.ఇ.ఓ.ల ద్వారా నివేధికలను తెప్పించాలని, కరోనా కారణంగా చాలాకాలం పాఠశాలలు తెరవకపోవడం వలన వాటిని పరిశుభ్రం చేయించి పునరుద్దరణ పనులు చేపట్టడం జరుగుతుందని, శిథిలావస్థలో ఉన్న తరగతి గదులు గాని, ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు గాని కూలిపోయోదశలో ఉన్నట్లు గుర్తించిన, పునరుద్దరణ పనులు చేపట్టవలసినవాటిని గుర్తించిన సమాచారం అందించినట్లయితే ఇంజనీరింగ్ అధికారులతో తనిఖీలు నిర్వహింపజేసి వాటిపై చర్యలు తక్షణ చర్యలు తీసుకొవడం జరుగుతుందని అన్నారు. పాఠశాల భవనాల పునరుద్దరణ కొరకు శాసన సభ్యులకు కేటాయించి సిడిపి నిధులు 2 కోట్లను వినియోగించాలని, నిధులు ఇంకా అవసరమైతే కలెక్టర్, జిల్లా పరిషత్ నిధులను కూడా కేటాయిస్తామని పేర్కోన్నారు. అభివృద్ది కొరకు నియోజక వర్గలా వారిగా పంచాయితి సెక్రటరీలు, సర్పంచులకు అవగాహన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని పేర్కోన్నారు.
జగిత్యాల ఎమ్మెల్యే డా. యం. సంజయ్ కుమార్ మాట్లాడుతూ, రైతులకు పంటసాగు, పంటమార్పిడిపై అవగాహన కల్పించాలని, వ్యవసాయ రంగ అభివృద్దిలో ప్రజాప్రతినిధులకు ప్రాతినిద్యం ఇవ్వాలని, రైతులు ఒకే రకమైన పంటపై ఆదారపడకుండా పంటమార్పిడికి ప్రభుత్వ ఆదేశించినందున ఆ దిశగా ఉద్యానవన శాఖ ద్వారా అయిల్ ఫాం పంట సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని, జిల్లా కేంద్రంలో ప్రధాన ఆసుపత్రిని ఆనుకొని ఉన్న పాత బస్టాండ్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఏర్పాటు చేసిన బస్ షెల్టర్లపై ప్రజలకు అవగాహన కల్పించి, బస్సుల వలన ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా చర్యలు చేపట్టాలని అభివృద్దిలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో సాగాలని సూచించారు.
కోరుట్ల ఎమ్మెల్యే కే. విద్యాసాగర్ రావు మాట్లాడుతూ, కోతుల వలన పడించిన పంట దక్కించుకోవడం లో ఇబ్బందులకు గురవుతున్నామని , అటవిశాఖ వారి ఆద్వర్యంలో అడవి ప్రాంతాలలో కోతులకు ఆహారంగా మర్రి, తునికి, వెలగ మరియు నెరేడు వంటి పండ్లమొక్కలను నాటేలా చర్యలు తీసుకోవాలని, శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలను కూల్చివేసిన సమయంలో వచ్చే కలపకు యాక్షన్ ద్వారా వచ్చే డబ్బుతో భవన అభివృద్దికి ఉపయోగించేలా చేస్తామని, మెట్పల్లి ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో బాద్యతతో పనిచేసే సిబ్బందిని నియమించాలని, ఒప్పంద పద్దతిలో పనిచేసే వారికి సకాలంలో వేతనాలను అందించేలా చూడాలని, మారుముల ప్రాంతాలకు కరోనా ప్రబావం కంటే ముందు ఎవిధంగా బస్సు సౌకర్యాలున కొనసాగించారో తిరిగి అదే విధంగా బస్సుల సౌకర్యాలను కల్పించేలా చూడాలని అన్నారు.
సమావేశానికి హజరైన పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ, రైతువేధికల వద్ద మహిళల ప్రాదాన్యం పెంచాలని, దాన్యం కొనుగోలు సమయంలో గన్నిసంచుల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని, మహిళా సంఘాలకు కేవలం ఋణాలను అదించడం మాత్రమే కాకండా, వారు అభివృద్దికి మరింత అవకాశాలను కల్పించాలని, పాఠశాలల్లో స్వీపర్లు, స్క్రాబ్ వెబర్లను ఏర్పాటు చేయాలని, వర్షాల వలన పాఠశాల పరిసరాలు, చుట్టుపక్కల నీరు నిలిచి ఉండకుండా చర్యలు చేపట్టాలని, పాఠశాలల్లో మద్యహ్నబోజన పథక నిర్వహణ, నీటిసౌకర్యం కల్పించాలని, గ్రామఅభివృద్ది సమావేశం నిర్వహించే సమావేశాలలో చట్టాలపై స్వష్టమైన అవగాహనను అందరికి అర్థం అయ్యేలా అవగాహన కల్పించాలని, విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా బస్సు సౌకర్యాన్ని కల్పించాలని తెలియజేశారు.
సమావేశం ద్వారా 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి 14 పనుల మంజూరికి 153 లక్షలతో జిల్లా పరిషత్ సిఈఓ తిర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అనంతరం టిటిడి బోర్డు సభ్యునిగా ఎన్నికై కోరుట్ల ఎమ్మెల్యే కె. విద్యాసాగర్ రావుని జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా కలెక్టర్, పలువురులు ప్రజాప్రతినిధులు సత్కరించారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది.

Share This Post