సమస్యల సత్వర పరిష్కార దిశగా పనులు జరగాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి
ప్రచురణార్థం–3 తేదిః 12-08-2021
సమస్యల సత్వర పరిష్కార దిశగా పనులు జరగాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి
జగిత్యాల, అగస్టు 12: భూమస్యలు, కళ్యాణలక్ష్మీ, షాదిముబారక్ మొదలగు వివిధ సమస్యలను సత్వర పరిష్కార దిశగా పనులు జరగాలని జిల్లా కలెక్టర్ జి. రవి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఆర్డిఓ, తహసీల్దార్లతో జూమ్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, కళ్యాణలక్ష్మీ, షాదిముభారక్ ధరఖాస్తులను పర్యవేక్షించాలని, శాసనసభ్యుల అనుమతులు లభించినవాటిని బడ్జెట్ ఆధారంగా పూర్తిచేసి లబ్దిదారులు పంపిణి చేయాలని పేర్కోన్నారు. ఆర్డిఓ, శాసనసభ్యులు లేదా బ్యాంకులలో పనులు జరుగకుండా ఉంచకూడదని తెలిపారు. సరైన దృవీకరణలు సమర్పించని వాటిని తిరస్కరించాలని సూచించారు. చెక్కుల పరిష్కారంలొ జాప్యం చేసే బ్యాంకు ఖాతాలను మరో బ్యాంకుకు మార్చాలని, పెండింగ్ మ్యూటేషన్ పెండింగ్ లో ఉన్న వాటిని పరిష్కరించాలని, భూసమస్యలను వెంటవెంటనే పరిష్కరించాలని, వచ్చే ధరఖాస్తులపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సూచించారు. సేత్వార్, కాస్రా అందుబాటులో లేనివి తిరస్కరించడం జరిగిందని, సీలింగ్ భూములను కూడా తిరస్కరించడం జరుగుతుందని, ఎక్కడ కూడా పొరపాట్లు లేకుండా సరిచూసుకొవాలని, అనంతరం నివేదికలను పంపించాలని అన్నారు. దాదాపు భూమస్యలను పరిష్కరించడం జరిగిందని, చివరి దశలొ వచ్చిన ధరఖాస్తులను సమీక్షించుకొవాలని పేర్కోన్నారు. ఈ ఆఫీస్ ఫైళ్ల పరిష్కారంలో జాప్యం జరగకూడదని, ఇసుక, పిడిఎస్ రైస్ అక్రమ రవాణ చేసిన వారిని బైండోవర్ చేయాలని, అప్రమత్తంగా ఉండడంతో పాటు, శాశ్వతంగా అక్రమ రవాణ జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎస్సి, ఎస్టీ అత్యాచార కేసులలో ప్రభుత్వం అందించే ఎక్స్గ్రేషియా పంపిణిలో, బాధితుల బ్యాంకు ఖాతాలలో నేరుగా డబ్బు జమచేయాలని, మద్యవర్తులుగా ఎవరు కూడా వ్యవహరించకుండా పర్యవేక్షించడంతో పాటు మద్యవర్తుల ప్రమేయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ శ్రీమతి జె. అరుణశ్రీ, కలెక్టర్ కార్యాలయ పర్యవేక్షకులు ఎస్. నాగార్జున, ఉదయ్ కుమార్, విజయలక్ష్మి, ఇతర సిబ్బంది పాల్గోన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది.
సమస్యల సత్వర పరిష్కార దిశగా పనులు జరగాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి
