సమస్య పరిష్కారం కొరకు ప్రజలు ఇచ్చిన పిర్యాదుల పరిష్కారానికి అధికారులు వ్యక్తి గతంగా శ్రద్ధ తీసుకోవాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.

22-11-2021

సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలు నందు ప్రజావాణి నిర్వహించి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. ఎంతో వ్యయ ప్రయాసలతో సుదూర ప్రాంతం నుండి వచ్చిన ప్రజలు సమస్య పరిష్కరించాలని దరఖాస్తులు చేస్తున్నారని, పరిష్కరించిన దరఖాస్తులపై కలెక్టరేట్ నందు నివేదికలు ఇవ్వాలని చెప్పారు.

ప్రజావాణిలో సమస్య పరిష్కారం కొరకు వచ్చిన దరఖాస్తులు కొన్ని::

 

కొత్తగూడెం మండలం, మధురబస్తీకి చెందిన యంపి రెహానా ఇంటి నెం. 9-2-99/3 ఉన్న ఇంటిని తన మామ స్వాధీనం చేసియున్నారని, నివాసం ఉంటున్న మా కుటుంబ సభ్యులను తన బావ కుమారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని, క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నానని విచారణ నిర్వహించి తనకు న్యాయం చేయాలని చేసిన దరఖాస్తును తగు చర్యలు కొరకు క్రమబద్ధీకరణ ప్రక్రియను పర్యవేక్షణ చేస్తున్న పర్యవేక్షకులకు ఎండార్స్ చేశారు.

 

పాల్వంచ మండలం, బసవతారక కాలనీకి చెందిన యం లక్ష్మి నిరుపేద కుటుంబానికి చెందిన తన కుమారుడు సాయి 19 సంవత్సరాలున్నాయని, పుట్టుకతోనే వికలాంగుడుగా జన్మించాడని, తన ఆర్ధిక పరిస్థితి బాగాలేనందున వికలాంగ కుమారుని సంరక్షణకు వ్యాపారం నిర్వహణకు రుణం మంజూరు చేయాల్సిందిగా చేసిన దరఖాస్తును జిల్లా సంక్షేమ అధికారికి ఎండార్స్ చేశారు.

 

మణుగూరు మండలం, శేషగిరినగర్కు చెందిన శ్రీమతి జె.సుధారాణి పుట్టుకతోనే దివ్యాంగురాలిగా జన్మించానని, జీవనోపాధి కొరకు ముద్ర రుణం మంజూరు చేపించాలని చేసిన దరఖాస్తును తగు చర్యలు నిమిత్తం ఎన్డీయంకు ఎండార్స్ చేశారు.

 

మణుగూరు మండలం, బండారుగూడెం గ్రామానికి చెందిన రౌతు రమేష్ బిటిపిఎస్ ఏర్పాటులో శేషగిరినగర్లో ఉన్న తన ఇంటి స్థలము, రేకుల ఇల్లును సేకరించారని, సర్వే నిర్వహణ సమయంలో కూలి పనుల నిమిత్తం వేరే చోటకు: వెళ్లడం వల్ల నోటీసులు తీసుకోలేదని, కావున కోల్పోయిన ఇంటికి మరియు కుటుంబ సభ్యులకు పునరావాసం కల్పించాల్సిందిగా ధరఖాస్తు చేయగా తగు చర్యలు నిమిత్తం బిటిపిఎస్ సిఈకి ఎండార్స్ చేశారు.

 

లక్ష్మీదేవిపల్లి మండలం, ఎదురుగడ్డ పంచాయతీకి చెందిన జి సరోజని మరికొందరు గ్రామస్థులు ప్రతి వీధిలోను డ్రైనేజి ఏర్పాటు చేయాలని, కమ్యూనిటీ హాలు నిర్మించాలని, ఓపెన్ జిమ్, చిల్డ్రనార్కు మొదలైనవి ఏర్పాటు చేయాలని చేసిన దరఖాస్తును తగు చర్యలు నిమిత్తం డిపిఓకు ఎండార్స్ చేశారు.

 

పాల్వంచ మండలం, బసవతారక కాలనీకి చెందిన వెంకన్న మరికొందరు గ్రామస్థులు 600 వరకు కుటుబాలున్నాయని, ఈ కుటుంబాలకు మంచినీరు సరఫరా లేదని, దాదాపు 3 కిమీ వరకు వెళ్లి కెటిపిఎస్ కాలనీ నుండి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తున్నదని, మా గ్రామానాకి మిషన్ బగీరథ మంచినీరు ట్యాంకు నిర్మించాలని కోరగా తగు చర్యలు నిమిత్తం పాల్వంచ మున్సిపల్ కమిషనర్క ఎండార్స్ చేశారు.

 

ఈ ప్రజావాణిలో డిఆర్టీ అశోక్ చక్రవర్తి, డిఆర్డిఓ మధుసూదన్ రాజు, డిపిఓ రమాకాంత్, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post