సమస్య పరిష్కారం కోరుతూ ప్రజలు ప్రజావాణిలో అందచేసిన దరఖాస్తులు పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో అన్ని శాఖల జిల్లా అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి సమస్యల యొక్క వినతులను స్వీకరించి పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేసినట్లు చెప్పారు. సమస్య యొక్క పరిష్కారానికి సంబంధించి తీసుకున్న చర్యలను దరఖాస్తు దారునికి లిఖితపూర్వకంగా సమాచారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులపై తీసుకున్న చర్యలు పరిష్కారం, పెండింగ్ అంశాలపై సమీక్ష నిర్వహించడం జరుగుతుందని, అన్ని శాఖల అధికారులు నివేదికలతో హాజరు కావాలని ఆయన పేర్కొన్నారు. ప్రజావాణిలో సమస్యను పరిష్కరించాలని ప్రజలు అందచేసిన దరఖాస్తులు కొన్ని: – చుంచుపల్లి మండలం, రామాంజనేయ కాలనీకి చెందిన వయోవృద్ధురాలైన మేకల మంగమ్మ తన ఇల్లు. కూలిపోయిందని, తనకు పరిహారం మంజూరు చేయాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తక్షణం ఆమెకు ఐదు వేల రూపాయాలు పరిహారంగా అందచేశారు. జూలూరుపాడు మండలం, పాపకొల్లు గ్రామానికి చెందిన ధరావత్ శారద సర్వే నెం.763/2/2/2/5లో తనకు 1.24 కుంటల భూమి ఉన్నదని, ఇట్టి భూమి తన కుమారుడు శివ పేరున జారీ చేసిన పాస్బుక్ ఉన్నదని, తన కుమారుడు 2020 మే లో మరణించారని అప్పటి నుండి తనకు రైతుబంధు నిధులు జమ కావడం లేదని, చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు తీసుకోవాల్సిందిగా వ్యవసాయ అధికారికి ఎండార్స్ చేశారు. అక్కినపల్లి వీరబాబు పెద్దిరెడ్డిగూడెంలో ప్రైవేట్ గ్రామసేవకుడిగా 12 సంవత్సరాల నుండి పనిచేస్తున్నానని, విధి నిర్వహణలో ప్రమాదానికి గురై తలకు గాయం కావడం వల్ల వికలాంగుడినయ్యానని, తనకు గ్రామ సేవకుడిగా పనిచేయడానికి అవకాశం కల్పించాల్సిందిగా చేసిన దరఖాస్తును తగు చర్యలు నిమిత్తం జిల్లా ఉపాధికల్పనాధికారికి ఎండార్స్ చేశారు. మణుగూరు పట్టణానికి చెందిన పోలోజు వెంకటాచారి గత సంవత్సరం మార్చి నెలలో జిల్లా కలెక్టర్ గారు. బెస్తగూడెం గ్రామంలో పర్యటించినపుడు పూరిగుడిసెలో నివాసం ఉంటున్న వయెవృద్ధురాలైన ఒంటరి మహిళ తనకు పక్కా ఇల్లు మంజూరు చేయాలని చేసిన వినతికి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు చిన్న ఇల్లు, మంచినీటి ట్యాంకు నిర్మాణం చేయడం జరిగిందని, నేటి వరకు బిల్లులు చెల్లింపు కాలేదని, తనకు నిధులు మంజూరు చేయాలని చేసిన దరఖాస్తుపై తక్షణమే తనకు నివేదికలు పంపాలని మున్సిపల్ కమిషనర్క ఎండార్స్ చేశారు. టేకులపల్లి మండలం, గళ్లపాడు గ్రామానికి చెందిన భుక్యా జగన్ వారసత్వంగా సంక్రమించిన భూమి పట్టా బదులుగా అసైన్మెంట్గా నమోదు చేశారని, నా యొక్క నూతన పట్టాదారు పాసుపుస్తకం నెం. 27220050279, ఖాతా నెం.1307, సర్వే నెం. 133/75/2లో ఉన్న 4.35 కుంటల భూమిని పట్టాభూమిగా సవరణ చేయాల్సిందిగా చేసిన దరఖాస్తును తగు చర్యలు నిమిత్తం కలెక్టరేట్ సెక్షన్ సూపరింటెండెంట్కు ఎండార్స్ చేశారు. కొత్తగూడెం మండలం, నాగయ్యగడ్డకు చెందిన పల్లపు పరిమళ 24-12-2020న వివాహం చేసుకున్నానని, కళ్యాణలక్ష్మి ద్వారా ఆర్ధికసాయం కొరకు దరఖాస్తు చేసుకున్నానని, అట్టి దరఖాస్తును తిరస్కరించారని, కావున విచారణ నిర్వహించి కళ్యాణలక్ష్మి మంజూరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చేసిన దరఖాస్తును విచారణ నిర్వహించాలని ఆర్డీఓకు ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post