సమాచార హక్కు చట్టం కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక కార్యక్రమాలు
ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా జిల్లాలలో కేసుల విచారణ
సమాచార హక్కు చట్టం కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక కార్యక్రమాలు
0 0 0 0
రెవెన్యూ తదితర శాఖలలో సమాచార హక్కుచట్టం కేసుల పరిష్కారం కొసం ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాలని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ డా. మహ్మద్ అమీర్ సూచించారు.
శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ శాఖలలో ఉన్న సమాచార హక్కు చట్టం కేసుల పరిష్కారంపై తీసుకోవలసిన చర్యలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సమాచార హక్కు చట్టంపై సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రజలకు అందుబాటులో కేసుల పరిష్కారం కోసం జిల్లాలలో ప్రత్యేక క్యాంప్ లను నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగానే శుక్రవారం కరీనంగర్ జిల్లాలో పెండింగ్ లో ఉన్న కేసుల ధరస్తుదారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులు త్వరితగతిన పరిష్కారించాలని అన్నారు. గతంలో సమాచార హక్కు చట్టం ఫిర్యాదుల పరిష్కారం హైదరాబాద్ నుండి చేపట్టడంతో ధరకాస్తుదారులు హైదరాబాద్ కు రావడం కోసం తీవ్రంగా ఇబ్బందులు పడేవారని, ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వారి కోసం జిల్లాలలో విచారణలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, కలక్టరెట్ ఎఓ లక్ష్మీనారాయణ, ప్రజా సమాచార అధికారులు, ధరఖాస్తు దారులు తదితరులు పాల్గోన్నారు.