సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపరాదని, వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ బి గోపీ కోరారు.

ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన నిర్వహించే ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం “అసమానతలను అంతం చేద్దాం- ఎయిడ్స్ ను రూపుమాపుదాం’ అనే నినాదంతో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ను ఈ రోజు వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కాజీపేట వెంకటరమణ అధ్యక్షతన కాకతీయ వైద్య కళాశాల  నుండి వరంగల్ ఐఎంఏ హాల్ వరకు పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీ నిర్వహించి, సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ బి. గోపి  హాజరై మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపరాదని, వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని కోరారు. అదేవిధంగా జిల్లా యంత్రాంగం తరఫున ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులకు వారు సొంతంగా జీవించడానికి కావలసిన రుణాలను మరియు పెన్షన్లను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కాజీపేట వెంకటరమణ  మాట్లాడుతూ జిల్లాలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల సంఖ్య, వారికి కల్పిస్తున్న చికిత్స వివరాలు మరియు సదుపాయాల గురించి వివరంగా తెలపడం జరిగింది. అదేవిధంగా ఎవరికైనా వ్యాధి లక్షణాలు కనబడితే వెంటనే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుని వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లోని ఏ ఆర్ టీ సెంటర్ ద్వారా చికిత్సకు కావాల్సిన మందులు తీసుకుని, జీవన ప్రమాణాలు మెరుగు పరుచుకోవచ్చు తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరపున వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో వ్యాధి లక్షణాలు ఉన్న వారిని గుర్తించి, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించాలని తెలిపారు.
ఈ సందర్భంగా ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు కృషి చేస్తూ, ఉత్తమ సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి మరియు స్వచ్ఛంద సంఘాలకు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ద్వారా పురస్కారాలు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, ఐఎంఏ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బి. బాలాజీ, కార్యదర్శి డాక్టర్ నారాయణ రెడ్డి, కేంద్ర సంఘ నాయకులు డాక్టర్ పెసరు విజయ్ చందర్ రెడ్డి, డాక్టర్ సూర్య ప్రకాష్, డాక్టర్ మదన్ మోహన్ రావు, జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ చల్లా మధుసూదన్, డాక్టర్ సుధార్ సింగ్, డాక్టర్ గోపాల్ రావు, డాక్టర్ ప్రకాష్ రావు, ఫిజియోథెరపీ డాక్టర్ నరసింహ రెడ్డి డిప్యూటీ డెమో అనిల్ కుమార్, హెచ్ ఈ ఓ జమాల్, హెల్త్ సూపర్వైజర్ పాలకుర్తి సదానందం, నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు, వైద్య సిబ్బంది, ఎన్ సి సి విద్యార్థులు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
????????????????????????????????????
????????????????????????????????????
????????????????????????????????????

Share This Post