సమాజంలోని సమస్యలకు వినూత్న పరిష్కారాలతో అవిష్కర్తలు ముందుకు రావాలి……జిల్లా కలెక్టర్ కె.శశాంక.

ప్రచురణార్థం

సమాజంలోని సమస్యలకు వినూత్న పరిష్కారాలతో అవిష్కర్తలు ముందుకు రావాలి……జిల్లా కలెక్టర్ కె.శశాంక.

మహబూబాబాద్, జూలై -19:

సమాజంలో ఎదురయ్యే సమస్యలను తమ వినూత్నమైన ఆలోచనలతో పరిష్కారం మార్గం చూపే ప్రయత్నమే ఇంటింటా ఇన్నోవేటర్ అని జిల్లా కలెక్టర్ కె. శశాంక తెలిపారు.

జిల్లా లోని అవిష్కర్తలకు చక్కటి వేదిక ఇంటింటా ఇన్నోవేటర్ అని, గ్రామీణ ఆవిష్కరణ, విద్యార్థుల ఆవిష్కరణ, ప్రారంభ ఆవిష్కరణలు, సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలలో ఆవిష్కరణలు ప్రదర్శించవచ్చునని, అన్ని రంగాల వారు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, రైతులు, యువకులు, ఐటీ నిపుణులు, గృహిణులు, రిసెర్చర్స్ అన్ని విభాగాల వారు పాల్గొనవచ్చునని తెలిపారు.

వాట్సాప్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ:

ఆవిష్కర్తలు తమ ఆవిష్కరణకు సంబంధించిన ఆరు వాక్యాలు, రెండు నిమిషాల వీడియోను, ఆవిష్కరణ, 4 నాలుగు ఫోటోలు, ఆవిష్కర్త పేరు, ఫోన్ నెంబర్, వయసు, ప్రస్తుత వృత్తి, గ్రామం పేరు, జిల్లా పేరు 9100678543 మొబైల్ నెంబర్కు వాట్సాప్ చేయాలని, ఎంపిక చేయబడిన వాటిని 15 ఆగష్టు స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ప్రదర్శింపబడతాయని, TSIC, హైదరాబాద్ వారిచే ప్రశంశ పత్రంతో అభినందించడం జరుగుతుందన్నారు. ఈ సదవకాశం అందరూ వినియోగించుకొని వినూత్న ఆవిష్కరణలతో సమస్యలకు పరిష్కారంతో ముందుకు రావాలని పూర్తి సమాచారం కొరకు జిల్లా సైన్స్ అధికారి అప్పారావు సెల్ నంబర్: 9849598281 లో సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు.

Share This Post