సమాజంలో ఉన్నతమైన వృత్తి జర్నలిజం పాత్రికేయులు వారి కుటుంబ సభ్యులు కంటి వెలుగుల ప్రత్యేక క్యాంప్ ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలి జిల్లా కలెక్టర్ సిహెచ్ .శివలింగయ్య

ప్రెస్ రిలీజ్

జనగాం జిల్లా, జనవరి 30

సమాజంలో ఉన్నతమైన వృత్తి జర్నలిజం

పాత్రికేయులు వారి కుటుంబ సభ్యులు కంటి వెలుగుల ప్రత్యేక క్యాంప్ ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలి

జిల్లా కలెక్టర్ సిహెచ్ .శివలింగయ్య

సోమవారం నాడు జిల్లాలోని పాత్రికేయుల కోసం ప్రత్యేకంగా కంటి వెలుగుల శిబిరం ఏర్పాటు చేసినట్లు ఈ కార్యక్రమం ద్వారా  జిల్లాలోని పాత్రికేయులు వారి కుటుంబ సభ్యులు వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలన్నారు,

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కంటి వెలుగుల కార్యక్రమంలో ప్రత్యేక క్యాంపుల ద్వారా పాత్రికేయులకు, వివిధ వర్గాల వారందరికీ క్యాంపులను ఏర్పాటు చేయడం జరిగిందని అందులో భాగంగానే ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బఫర్ టీం ద్వారా జర్నలిస్టులకు ఈ సౌకర్యం కల్పించామని అన్నారు,

సమాజంలో అత్యున్నతమైన వృత్తి జర్నలిజం అని వృత్తిలో భాగంగా పాత్రికేయులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు,

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పాత్రికేయుల ఉండాలని వివిధ సమస్యలపై అవగాహన కల్పించేందుకు పత్రికలు, టివిలు, సామాజిక మాధ్యమాల ద్వారా  ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు వారు కృషి ఎంతో ఉపయోగకరంగా ఉందని ఆయన అన్నారు,

జిల్లాలో (26) టీం ల ద్వారా కంటి వెలుగుల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఇప్పటివరకు జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కంటి వెలుగుల కార్యక్రమం కొనసాగుతుందని ఇంకా వైద్య పరీక్షలు చేసుకొని వారు వెంటనే సంబంధిత క్యాంపులకు వెళ్లి వైద్య పరీక్షలు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య అన్నారు,

పాత్రికేయులతోపాటు జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య కంటి వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు,

వైద్యులు సూచనల మేరకు ప్యాంట్ ఉన్న పాత్రికేయులకు జిల్లా కలెక్టర్ ద్వారా గ్లాసులు పంపిణి చేశారు,

ఈ వైద్య పరీక్షల్లో పాత్రికేయులు కిరణ్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ ఎ.మహేందర్, అనిల్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ పి. సుగుణాకార్ రాజ్, మల్లారెడ్డి,వెంకటస్వామి, భాస్కర్ గణేష్ , శ్రీనివాస్ రెడ్డి, మధు, రాము, తదితర జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు,

Share This Post