సమాజంలో ప్రతి ఒక్కరూ వినియోగదారులే, ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి – అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి

సమాజంలో ప్రతి ఒక్కరూ వినియోగదారులేనని, వినియోగదారుల హక్కులు, బాధ్యతలు తెలుసుకోవాలని నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
డిసెంబర్ 24 జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం నాగర్ కర్నూల్ ప్రభుత్వ బాలుర కళాశాలలో ఏర్పాటు చేసిన సందర్భంగా వినియోగదారుల చట్టాన్ని విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు నిర్వహించిన
కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
వినియోగదారులు మోసపోయినపుడు తన హక్కుల కోసం పోరాడాలని సూచించారు. సమాజంలో ప్రతి వినియోగదారుడు చైతన్య వంతంగా ఉండాలన్నారు. జీవితంలో చైతన్యం కోల్పోతే మోసపోతారని చెప్పారు.
కల్తీని ప్రశ్నించడం ప్రతి ఒక్కరి బాధ్యత ను మరిచిపోవద్దని సూచించారు.
చట్టంలో వినియోగదారులు ఏ ప్రాంతంలో నివాసం ఉంటే ఆ ప్రాంతం లోని ఫొరమ్లో కేసు వేయవచ్చన్నారు. వినియోగదారుడు ఏదేని వస్తువు కొనుగోలు చేసే ముందు తెలిసిన వ్యక్తులు మంచిదని చెప్పిన దాని ప్రకారం కొనుగోలు చేస్తారని, కొని మోసపోతే వారిపై కూడా కేసు వేయావల్సిన అవకాశం ఉందన్నారు.
వినియోగదారుల పరిరక్షణ చట్టం భారతీయ వినియోగదారులకు గొప్ప వరమన్నారు.
ప్రస్తుతం వస్తువులను గానీ సేవలను గాని పొందిన జిల్లాలో ఫిర్యాదు చేయాల్సి వచ్చేదన్నారు. వినియోగదారుల ఆరు హక్కుల్లో ఒకటైన వినియోగ విద్యను వినియోగ చైతన్యంగా మార్చారన్నారు.
అనుచిత వ్యాపార ధోరణిని అరికట్టడానికి పక్కదారి పట్టించే వ్యాపారాల్ని అరికట్టడానికి అధికారాలు ఇచ్చారన్నారు.
ఈ అథారిటీకి నేరుగా వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చన్నారు.
వినియోగదారుల హక్కుల రక్షణ కోసం 1986లో ప్రభుత్వం వినియోగదార్ల హక్కు పరిరక్షణ చట్టాన్ని ప్రవేశపెట్టిందన్నారు. వినియోగదార్ల విస్తత ప్రయోజనాలను దష్టిలో ఉంచుకొని ప్రస్తుత ప్రభుత్వం నూతన చట్టం వినియోగదార్ల పరిరక్షణ చట్టం 2019 తీసుకువచ్చిందన్నారు. ఆగస్టు 9, 2019 నుంచి ఈ చట్టం అమలులోకి వచ్చిందన్నారు. చట్టంపై ప్రజల్లో విద్యార్థులే అవగాహన కల్పించాలన్నారు. ఆన్‌లైన్‌ కొను గోలుపై మోసాలు జరుగుతున్నట్టు వింటున్నామని, వాటిపై జాగ్రత్తగా ఉండాలన్నారు.
సమాజంలో జరుగుతున్న మోసాలపై విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు.
ఉపన్యాసకులు నరసింహులు గ్యాస్ సిలిండర్ల సరఫరా రుసుము అధికంగా తీసుకుంటున్నారని అధికారుల దృష్టికి తీసుకురాగా, అందుకు స్పందించిన జిల్లా పౌర సరఫరాల అధికారి మోహన్ బాబు 15 కిలోమీటర్ల లోపల వరకు ఎలాంటి డెలివరీ ఛార్జీలను విధించ కూడదని పదిహేను కిలోమీటర్లు దాటిన తర్వాత 20 రూపాయలు మాత్రమే ఛార్జ్ విధించాలన్నారు అందుకు భిన్నంగా వసూలు చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సూచించారు.
జిల్లా పౌరసరఫరాల అధికారి మోహన్ బాబు, జిల్లా రవాణా శాఖ అధికారి ఎర్రి స్వామి, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్‌ బాల్రాజ్, సంబందిత అధికారులు, ఉపన్యాసకులు నర్సింలు, డిటి కవిత, ఐకెపి మేనేజర్ శ్రీనివాసులు, కళాశాల లెక్చరర్లు విద్యార్థినులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post