slot anti rungkat 2023

slot anti rungkat 2023

slot deposit dana

2023

slot deposit dana

slot gacor

సమాజంలో రైతును గౌరవించినప్పుడే సమాజ అభ్యున్నతి సాధ్యo- రాష్ట్ర వ్యవసాయ , సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి -సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి – Information and Public Relations Department, Government of Telangana

సమాజంలో రైతును గౌరవించినప్పుడే సమాజ అభ్యున్నతి సాధ్యo- రాష్ట్ర వ్యవసాయ , సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి -సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

పత్రిక ప్రకటన
తేది 30-11-2022
నాగర్ కర్నూల్ జిల్లా.

సమాజంలో రైతును గౌరవించినప్పుడే సమాజ అభ్యున్నతి సాధ్యమని రాష్ట్ర వ్యవసాయ , సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం పాలెం వ్యవసాయ కళాశాలలో ఏర్పాటు చేసిన తెలంగాణ దక్షిణ మండల కిసాన్ మేళాలో వ్యవసాయ శాఖ మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక యుగంలో ఆహార రంగమే అతిపెద్ద పరిశ్రమ అని పేర్కొన్నారు. సర్వ ప్రాణులకు ఆహారమే మొదటి ప్రధాన్యమని ఆహారం లేకుండా ఏ జీవి బ్రతకాజాలదన్నారు. అలాంటి ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్న రైతును గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. చాలా సంవత్సరాల తర్వాత పాలెం వ్యవసాయ పరిశోదన కేంద్రంలో కిసాన్ మేళా నిర్వహించడం జరిగిందన్నారు.
పరిశోధనా ఫలాలు క్షేత్రస్థాయిలో రైతులకు చేరాలని, ఆ ఫలాలతో రైతులు అద్భుతమైన వ్యవసాయ ఉత్పత్తులు సాధించాలని తెలియజేసారు. మానవ పరిణామక్రమంలో గత 10, 11 వేల ఏళ్లు కీలకమని, అంతకుముందు అంతా స్థిరనివాసం లేని కాలమని,
స్థిరనివాసం ఏర్పడిన తర్వాత వచ్చిన పరిశోధనలు, ఆవిష్కరణలు అత్యంత గొప్పవని పేర్కొన్నారు. ప్రతి రోజు భూమ్మీద పుడుతున్న వారి సంఖ్య 2 లక్షలు, మరణిస్తున్న వారి సంఖ్య లక్ష.
ప్రపంచ జనాభాకు అత్యంత ప్రాధాన్యం ఆహారం .. ఏది లేకున్నా నడుస్తుంది కానీ ఆహారం లేకుంటే నడవదన్నారు. ప్రపంచ జనాభాకు సరిపడా ఆహారం సమకూర్చుకునేందుకు వ్యవసాయ ఉత్పత్తులను పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నదన్నారు. భూమి యొక్క సారాన్ని పెంచుకోవడంతో పాటు ఉత్పాదకతను పెంచుకోవాలని రైతులను కోరారు.
వ్యవసాయంలో సహజ సిద్ద ఎరువుల వినియోగం తగ్గిపోతున్నదని రసాయన ఎరువుల వినియోగం పెరిగిపోయిందన్నారు. రోజువారీ అవసరాలకు అవసరమైన కూరగాయలు సైతం రైతు తన పంటచేలో పండించుకోవడం లేదని వాపోయారు. ఏటా రెండు సార్లు భూసార పరీక్షలను విధిగా నిర్వహించాలని ఇందుకు వ్యవసాయ విస్తరణ అధికారులు క్లస్టర్ల వారీగా రైతులను చైతన్యపరచాల్సిన అవసరం ఉందన్నారు. భూసార పరీక్షల ఫలితాల అనంతరం అధికారుల సూచనల మేరకు రైతులు ఎరువులను వినియోగిస్తే పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయని పంట దిగుబడి బాగా వస్తుందన్నారు.
నేడు పంట ఉత్పత్తులలో పురుగుమందు అవశేషాలు పెరిగి ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నదని
వ్యవసాయంలో ఎరువుల వినియోగం తగ్గించికోవాలని సూచించారు. భూమిలో కర్బనశాతం పెంచుకోవాలని, ఏడు శాతం ఉండాల్సిన చోట కేవలం ఒక శాతం మాత్రమే ఉన్నదన్నారు.
పిల్లిపెసర, జీలుగ విత్తనాలను రైతులు విరివిగా వినియోగించాలని సూచించారు. తెలంగాణలో కోటీ 46 లక్షల ఎకరాల భూమి ఉన్నదని అందులో 92.5 శాతం భూమి 5 ఎకరాల లోపు రైతుల చేతుల్లో ఉన్నదని రైతు బంధు పై విశ్లేషించారు. నేడు జొన్న, గట్క ఆదానీలు, అంబానీలు తింటున్నరు .. అడ్డగోలు తిండి ప్రజలు తింటున్నారని, ఇంటి ముందు పండ్ల చెట్లు పెంచుకునేందుకు కూడా ప్రజలు ఆసక్తి చూపడం లేదన్నారు.
స్వయంగా వ్యవసాయం చేసి అందులో ఇబ్బందులు గమనించానన్నారు.రాబోయే పాలకులు శాస్త్రీయంగా ఆలోచించి ప్రోత్సాహం ఇస్తే పదేళ్ల తర్వాత ప్రపంచానికి అవసరమైన ఆహారం అందించగలిగేది మన దేశమే అవుతుందన్నారు. ఈ వానాకాలంలో 65 లక్షల ఎకరాలలో వరి సాగయిందన్నారు. సమైక్యరాష్ట్రంలో పాలకుల వివక్ష మూలంగా గొలుసుకట్టు చెరువులు దెబ్బతిని తెలంగాణ రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొన్నదని,
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయరంగ స్వరూపం సంపూర్ణంగా మారిపోయిందని తెలిపారు. వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్ లో ఆహార సంక్షోభం వస్తుందని హెచ్చరించారు.
అంతకుముందు నాగర్ కర్నూలు జిల్లా పాలెం వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో రూ.93 లక్షలతో నిర్మించిన భూసార పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని ఆయా కంపెనీలు తయారు చేసిన ఎరువులు, రసాయన మందులు, ఆధునిక వ్యవసాయ యంత్రాలు, వ్యవసాయ పరిశోధకులు తయారు చేసిన వంగడాల స్టాల్స్ ను మంత్రి సందర్శించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన జిల్లా పరిషత్ చైర్మన్ బాలాజీ సింగ్ మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రం ఏర్పడక ముందు రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్తమంత్రి ఒక్కొక్కటిగా రైతుల సమస్యలు పరిష్కరించారని అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి స్వయంగా ఒక రైతు కావడంతో వ్యవసాయ రంగంలో సమూల మార్పు తీసుకువచ్చారని కొనియాడారు. వ్యవసాయ శాస్త్రవేత్తలకు అన్ని సహాయ సహకారాలు అందిస్తూ మనిషికి కావలసిన నాణ్యమైన ఆహార ధాన్యం వంగడాలను అభివృద్ధి చేయిస్తున్నారని పేర్కొన్నారు.
జిల్లా ఆదనవు కలెక్టర్ మోతిలాల్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పాడ్డాక వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి రైతుకు కావలసిన సాగు నీరు, విద్యుత్తు, రైతు పెట్టుబడిగా రైతు బంధు ఇవ్వడంతో పాటు పండించిన పంటకు మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదన్నారు. జిల్లాలో వానాకాలం పంటకు 202 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సివిల్ సప్లై శాఖ ద్వారా ధాన్యం చేస్తుందన్నారు.
గద్వాల శాసన సభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో సింథటిక్ మందులు రావడం వల్ల చాలా నాశనం జరిగిందన్నారు. విపరీతమైన రసాయన ఎరువులు, మందులు వాడకం వల్ల ఆహార పదార్థాల్లో అవశేషాలు ఉండిపోయి వాటిని తింటున్న మనిషి బలం లేకుండా అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. ఆధునిక వ్యవసాయ యంత్రాలు, నాణ్యమైన వంగడాలు తయారు చేస్తూన్నందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమ నిర్వాహకులు పరిశోధన సహాయ సంచాలకులు గోవర్ధన్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో రైతులకు అవసరమైన నాణ్యమైన వంగడాలను అభివృద్ధి చేసి రైతులకు అందిస్తామన్నారు. ఇందుకు జునాగడ్, రాయచూరు, కదిరి, ట్రాంబే వ్యవసాయ పరిశోధనా కేంద్రాల నుండి నమూనా వంగడాలు సేకరించి వాటిని ఆభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. వేరు శనగ, ఆముదం, జొన్న, పశు గ్రాసం విత్తనాలు మొదలగునవి మేలైన వంగడాలు ఆభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో కొరమండల్ ఉపాధ్యక్షులు సుబ్బారెడ్డి, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ జగదీశ్వర్, ఆర్.ఏ.సి శ్రీనివాస్, డా. సుధారాణి, స్థానిక సర్పంచ్ లావణ్య సైతం మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో బిజినేపల్లి ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, ఉప్పునూతల జడ్పిటిసి ప్రతాప్ రెడ్డి, పదరా జడ్పిటిసి రాంబాబు, వెంకటాపురం సర్పంచ్, ఎంపిటిసి ఖానాపూర్ రఘురామ రెడ్డి, ఉమ్మడి జిల్లా వ్యవసాయ అధికారులు, సైటిస్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
—————
జిల్లా పౌర సంబంధాల అధికారి, నాగర్ కర్నూల్ ద్వారా జారీ.

Share This Post