సమాజాభివృద్ధిలో వయోవృద్ధులు భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య పిలుపునిచ్చారు.

Jan
ప్రచురణార్థం

వృద్ధుల భాగస్వామ్యం తోనే సమాజాభివృద్ధి…

జనగామ అక్టోబర్ 1.

సమాజాభివృద్ధిలో వయోవృద్ధులు భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య పిలుపునిచ్చారు.

శనివారం జిల్లా కేంద్రంలోని హైదరాబాదు రోడ్డులో ఉన్న విజయ ఫంక్షన్ హాల్ లో అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాల వేడుకలను జిల్లా మహిళా శిశు సంక్షేమం దివ్యాంగుల సంక్షేమం వయోవృద్ధుల సంక్షేమం శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాలను పురస్కరించుకొని కొలిపాక బాలయ్య రచించిన పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కాలానికి అనుగుణంగా వయోవృద్ధులు మారాలని పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. రోజు వారి దినచర్యలో భాగంగా వయోవృద్ధులు ఖాళీగా కూర్చో రాదని చేతనైనంత వరకు ఏదో ఒక పని చేస్తూ సమాజంలో భాగస్వాములు కావాలన్నారు.
మారుతున్న సమాజం జీవన విధానాలు మానవ సంబంధాలను దూరం చేస్తున్నాయని అందుకు మార్పులే ప్రధాన కారణమన్నారు.
స్వయం సమృద్ధి సాధించేందుకు వయవృద్ధులు ఏదో ఒక వ్యాపకం పెట్టుకుని రాణించాలని ఆస్తులు చివరి దశ వరకు పంపకాలు చేయరాదన్నారు.
వయోవృద్ధుల సంక్షేమం కొరకు తొలిసారిగా 2007 సంవత్సరంలో ప్రభుత్వం చర్యలు చేపట్టిందని 2011 సంవత్సరంలో చట్టంగా రూపొందింది అన్నారు 2016 నుండి పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేయబడ్డాయన్నారు. పిల్లలు తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా కొలిపాక బాలయ్య రచించిన పుస్తకంలోని పలు అంశాలను సభ దృష్టికి తీసుకువచ్చారు టీవీ సీరియల్స్ కుటుంబాల మధ్య అంతరాలను పెంచుతున్నాయన్నారు. వయో వృద్ధుల సమావేశ వేదిక కొరకు కృషి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
వయోవృద్ధులను ఇబ్బందులకు గురి చేస్తే 14567 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చు అన్నారు. గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ జిల్లా మహిళా శిశు సంక్షేమ దివ్యాంగుల సంక్షేమం వయోవృద్ధుల సంక్షేమం శాఖ అధికారిని జయంతి వైద్యాధికారి మహేందర్ ఉద్యాన అధికారి లత పౌరసరఫరాల అధికారి రోజా రాణి సివిల్ సప్లై జనరల్ మేనేజర్ సంధ్యారాణి జిల్లా వయోవృద్ధుల అసోసియేషన్ అధ్యక్షులు రామస్వామి రాష్ట్ర ఉపాధ్యక్షులు యాదవ రెడ్డి సఖి సెంటర్ ప్రతినిధి రేణుక వయోవృద్ధులు తదితరులు పాల్గొన్నారు .

Share This Post