సమాజ చైతన్యంతోనే అవినీతి నిర్మూలన :: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల, డిశంబరు 04: సమాజ చైతన్యం తోనే అవినీతి నిర్మూలన సాధ్యమని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జరిగిన అవినీతి వ్యతిరేక వారోత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని సిబ్బందిచే అవినీతి నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 9 వరకు అవినీతి వ్యతిరేక వారోత్సవాల నిర్వహిస్తుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అవినీతి దానివల్ల సమాజానికి జరుగుతున్న నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని, అవినీతి నిర్మించాలనే సంకల్పంతో సమాజంలో చైతన్యం కలిగించేందుకు గాను ప్రతి సంవత్సరం డిసెంబర్ 9న అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం జరపాలని ఐక్యరాజ్య సమితి తీర్మానించిందని, అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ ప్రజలకు అవినీతి వల్ల కలిగే నష్టాలు వివరించడంతో పాటు ఏసిబీ కార్యకలాపాల పట్ల అవగాహన కల్పించడం, వారి సందేహాలు తీర్చడం లక్ష్యంగా అవినీతి వ్యతిరేక వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, జిల్లా ఎసిబి అధికారులు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజలు రద్దీగా ఉండే ప్రదేశాల్లో కరపత్రాలు అతికించడం, కరపత్రాలు పంచడం, కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మండల స్థాయిలో ప్రజలకు అవగాహన కలిగించే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన అన్నారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో యువత స్వచ్ఛంద సంస్థలు ఉద్యోగులు తమ సహకారం అందించాలని కలెక్టర్ కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఓ గంగయ్య, పర్యవేక్షకులు రవికాంత్, రమేష్, రామకృష్ణ, సుజాత, మైనారిటీ సంక్షేమ శాఖ ఓఎస్డీ ఎండి. సర్వర్ మియా, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post