సమానత్వం, సోషలిజం కొరకు పోరాడిన బసవేశ్వరుడు ప్రతి ఒక్కరికి ఆదర్శ ప్రాయుడని జిల్లా అదనపు కలెక్టర్ పద్మజా రాణి అన్నారు

సమానత్వం, సోషలిజం కొరకు పోరాడిన  బసవేశ్వరుడు ప్రతి ఒక్కరికి ఆదర్శ ప్రాయుడని జిల్లా అదనపు కలెక్టర్ పద్మజా రాణి అన్నారు.  మంగళవారం వీరశైవ లింగాయత్ లింగబలిజ ఆరాధ్య దైవం బసవేశ్వర  జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్ లో అధికారులు, సంఘం నాయకులతో కలిసి  చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నివాళులర్పించారు.  ఈ సందర్బంగా అదనపు కలెక్టర్  మాట్లాడుతూ 12వ శతాబ్దం నాటి బసవేశ్వరుడు కులమతాలకు అతీతంగా లింగభేదం లేకుండా మనుషులంతా ఒక్కటే అనే విషయాన్ని ప్రజల్లో బలంగా తీసుకెళ్లారని కొనియాడారు.  బసవేశ్వరుని వచనాలతో సమాజంలో ఒక మంచి మార్పు తీసుకురావాడనికి కృషి చేశారన్నారు.  ఎన్నో వచనాలతో సమ సమాజ స్థాపనకు కృషి చేసినందుకు విశ్వగురువుగా పిలువబడ్డారని కొనియాడారు. నేటి యువత సమాజం బసవేశ్వరుడు చూపిన అడుగుజాడలు సన్మార్గంలో  నడవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా బిసి  అధికారులు కృష్ణమ చారి,  జిల్లా సివిల్ సప్లైల్ మేనేజర్ హాథిరామ్ నాయక్, ఆర్డీఓ రామచందర్ నాయక్ ,జిల్లా సర్వేయర్ మల్లేష్ అవుటి, బాలాజీ సాపర్, మున్సిపల్ చైర్మన్ గాంధే అనసుయ్య చంద్రకాంత్,  వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం గౌరవాధ్యక్షులు శివ కుమార్, అధ్యక్షులు గాంధే రవి కాంత్,  తదితరులు పాల్గొన్నారు.

Share This Post