సమిష్టి కృషితో ఆదర్శ గ్రామాలను తీర్చిదిద్దుదాలి :: రాష్ట్ర పంచాయితీ రాజ్, రూరల్ డెవలప్మెంట్ శాఖా మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు

సమిష్టి కృషితో ఆదర్శ గ్రామాలను తీర్చిదిద్దుదాలి :: రాష్ట్ర పంచాయితీ రాజ్, రూరల్ డెవలప్మెంట్ శాఖా మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు

పత్రికాప్రకటన తేదిః 06-07-2021
సమిష్టి కృషితో ఆదర్శ గ్రామాలను తీర్చిదిద్దుదాలి :: రాష్ట్ర పంచాయితీ రాజ్, రూరల్ డెవలప్మెంట్ శాఖా మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు
జగిత్యాల, జూలై 06: పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు కృషి చేసి మీ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర పంచాయితీ రాజ్, రూరల్ డెవలప్ మెంట్ శాఖా మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు అభిప్రాయపడ్డారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా జగిత్యాల రూరల్ మండలం హబ్సిపూర్ గ్రామంలో సోమవారం రాత్రి పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రివర్యులు, ఉదయం గ్రామంలో స్థానిక శాసన సభ్యులతొ కలిసి పర్యటించారు. అనంతరం జగిత్యాల నియోజక వర్గంలోని కల్లెడ నుండి లక్ష్మీపూర్ వయా గుట్రాజ్ పల్లి వరకు 2.72 కోట్లతో ఏర్పాటు చేసిన బిటి రోడ్డు, 4 కోట్లతో నిర్మించిన బ్రిడ్జి శంకుస్థాపన చేసి రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలో రాష్ట్ర సంక్షేమ శాఖా మాత్యులు కోప్పుల ఈశ్వర్ గారితో కలిసి రైతువేదికను, 7.40 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనాన్ని ప్రారంభించారు, అనంతరం భూపాతిపూర్ గ్రామంలో PMGSY ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం క్రింద రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసి పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించిన చేశారు. అనంతరం బోర్నపల్లి గ్రామంలో పలు కార్యక్రమాలలో పాల్గోన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, పల్లెప్రగతి పనులు గ్రామంలో ఆశించినమేర జరగడం లేదని, ఎస్సి కాలనిలో ఎక్కడి చెత్త అక్కడే ఉందని, శితిలావస్థలో ఉన్న ఇళ్లను తొలగించడం జరగలేదని అన్నారు. పాత ఇళ్లలో ఉండేవారు ఆ ఇళ్లను, పరిసరాలను శుభ్రం చేసుకోవడం వలన దోమలు, పురుగులు వంటివి పెరగకుండా నిరోధించగలుగుతామని పేర్కొన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాస్వరూపాన్ని మార్చుకోగలుగుతామని, చెత్తచెదారాన్ని తొలగించడం, మొక్కలను నాటడం, పాత నివాసయోగ్యం కాని ఇళ్లను తొలగించడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. అనంతరం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కరోనా ప్రబావంతో ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తిన, ఏమాత్రం వెనకడుగు వేయకుండా వృద్దుల ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తూ పించన్లను అందించడంతో పాటు, 60 సంవత్సరాల నుండి 57 సంవత్సరాలకు పించను అందిస్తున్న ఎకైక రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే అని అన్నారు. గతంలో మంచినీటి కోసం ఖాళి బిందేలతో రోడ్లపైకి వచ్చే పరిస్థితులు, వ్యవసాయం కొరకు సరైన కరెంటు లేక మెటార్లు కాలిపోయిన పరిస్థితులతో పాటు ఇతర రాష్ట్రాలు చేపట్టిన ప్రాజెక్టులతో నీరు వస్తుందో రాదో అన్న సందిద్గాలకు సమాదానంగా కాళేశ్వర్ ప్రాజెక్టు నిర్మాణం చేసి చెరువులు నింపడం మాత్రమే కాకుండా గోదావరి నీటికి ఒడిసి పట్టి పైపులైను ద్వార త్రాగునీటిని, 24 గంటల కరెంట్ అందించిన ఘనత కేసిఆర్ గారికే దక్కుతుందని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్దిలో బాగంగా హబ్సిపూర్ గ్రామానికి 80 లక్షలు, కల్లెడ గ్రామానికి 1 కోటి రూపాయలను, కేటాయించడం జరిగిందని అన్నారు. ఒకప్పుడు పెళ్లిలో మేనమాన తాళిబోట్టు, డబ్బులను ఇచ్చే సాంప్రదాయం ఉండేదని, ఇప్పుడు కేసిఆర్ పేదవారిళ్లలొ మేనమానగా మారి కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ ల ద్వారా చేయుతనందిస్తున్నారని అన్నారు. గర్బీనీలను అంబులెన్స్ లద్వారా ఆసుపత్రులకు తీసుకువెల్లడం, ప్రసవం అనంతరం కేసిఆర్ కిట్ అందించడం జరుగుతుందని, వ్యవసాయరంగాన్ని అభివృద్ది చేసే క్రమంలో 24 గంటల కరెంటును అందించి, వలసకార్మికులుగా మారిన రైతులను తిరిగి గ్రామాల బాటపట్టించి తిరిగి వ్యవసాయాన్ని చేయించిన వ్యక్తి కేసిఆర్ అని కొనియాడారు. మతాలకు అతీతంగా చనిపోయిన వారందరికి ఒకేచోట దహనసంస్కారాలు జరిగేలా గ్రామాలలో వైకుఠదామాలు ఏర్పాటు చేయడం జరిగింది, వైకుఠదామాలు కుడా దేవాలయాలేనని, చివరలో అందరుచేరుకునే అక్కడికే అన్ని అన్నారు. వైకుంఠదామాల చుట్టు గ్రీన్ ఫెన్సింగ్ ను ఏర్పాటు చేయాలని అన్నారు. మనఇళ్లలో చేత్తను ఇంటిముందు ఖాళీ ప్రదేశాలలో పడేసి అనారోగ్యాల పాల కాకుండా, ప్రతి గ్రామపంచాయితి చెత్తసేకరణ కొరకు ట్రాక్టర్ ను అందించి తడిచేత్త, పొడిచెత్తను వేరువెరుగా సేకరించి డంపింగ్ యార్డులకు తరలించి వాటితో కంపోస్ట్ ఎరువును తయారుచెయించడం జరుగుతుందని, ఈ సందర్బంగా తడి, పొడి చెత్తను వేరువెరుగా సేకరించి డంపింగ్ యార్డులకు తరలించి కంపోస్ట్ ఎరువులను తయారుచేసుకుంటున్న ప్రజాప్రతినిధులను, అధికారులను అభినంధించారు. గ్రామాలు పూర్తి ఆరోగ్య, పరిశుభ్రతతో విషజ్వరాలు లేని ఆరోగ్య తెలంగాణా అని స్వయంగా కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి ప్రకటించారని తెలిపారు. గ్రామాలలో చిన్నచిన్న మొక్కలను నాటారని గ్రామపంచాయితి నిధుల నుండి 10% వినియోగించి పెద్దపెద్ద మొక్కలు మాత్రమే నాటాలని, వాటి సంరక్షణ బాద్యతలు కూడా స్వీకరించి మొక్కలను పరిరక్షించాలని పేర్కోన్నారు. గ్రామాల అభివృద్దిలో బాగంగా గ్రామంలోని యువత, వృద్దులు, రిటైర్డ్ ఉద్యోగులతో కమిటిలను ఏర్పాటు చేసి, గ్రామాన్ని వదిలివెళ్లి వారి నుండి గ్రామ అభివృద్దికి నిధులను సేకరించి ఊరు కోసం ఒకరోజు పనిచేయాలనే అభిమానం పెంపొందించాలి అన్నారు. నిధులను సమకూర్చిన వారివివరాలను బోర్డుపై వ్రాయించాలని అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలను అభివృద్ది పరిచి, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో 10వేల కోట్లను కేటాయించడం జరిగిందని, 40వేల కోట్లు ఖర్చు చేసి ప్రతి ఇంటికి మంచీనీరు అందించడం జరుగుతుందని, గ్రామాల అభివృద్దికి సర్పంచులకు వేయి కోట్లు మంజూరు చేయడం జరిగిందని, దళితుల అభివృద్దికి ఒక్కరికి 10లక్షలు ఇచ్చే ప్రణాళికను రూపొందించడం జరుగుతుందని పేర్కోన్నారు. కరోనా విపత్కర పరిస్థీతులలో సైతం రైతాంగాన్ని అభివృద్ది చేయడంలో బాగంగా రైతుబందు కొరకు 10వేల కోట్ల ఋణాలను తీసుకువచ్చి రైతుల ఖాతాలలో జమచేయడం జరిగిందని, వృదుల గౌరవాన్ని నిలబెడుతూ ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించడం మాత్రమే కాదు 1500 నుండి 3వెలకు పెంచడం జరిగిందని అన్నారు. ఇటువంటి బృహత్తర కార్యక్రమాలతో కేసిఆర్ గారు రాష్ట్రాలకె ఆదర్శంగా నిలిచారని అన్నారు. బోర్నపెల్లి లో సిసి రోడ్డు నిర్మాణం కొరకు 25 లక్షలు, కొత్త గ్రామపంచాయితి భవనం కొరకు 25 లక్షలను వెంటనే మంజూరు చేయడం జరుగుతుందని పేర్కోన్నారు. ప్రతి మహిళా బృందానికి 3లక్షలు మిత్తి లేకుండా ఋణాలను మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ఋణాలను పొందిన వారికి ఋణం మాఫి చేయడం జరుగుతుందని, సగం కట్టిన తరువాత చనిపోయిన వారికి మిగిలిన డబ్బులు తిరిగి ఇప్పించడం జరుగుతుందని పేర్కోన్నారు. మహిళా సంఘం భవనం కొరకు ఏర్పాట్లను చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.
సంక్షేమశాఖా మాత్యులు కోప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, పల్లెప్రగతి కార్యక్రమం ఉరూ ఎంతో కోలాహలంగా జరుగుతుందని, పల్లెప్రగతి దేశంలోనె ఒక మోడల్ కార్యక్రమని, దేశంమొత్తంలో గ్రామానికి కావలసిని మౌళిక వసతులను కల్పించాలనే ఆలోచన తెలంగాణకు తప్ప ఏ రాష్ట్రానికి లేదని, పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా పల్లెల స్వరుపాలు మారిపోయాయని, నాలగు సంవత్సరాలగా చేపడుతున్న పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామం పచ్చదనం, పరిశుభ్రతతో అన్ని వసతులతో కూడిన వసతులతో ఎదురవుతున్నాయని అన్నారు. ఎన్నడు అనుకోనివిధంగా గ్రామానికి ఒక ట్రాక్టర్, వైకుఠదామాం, నర్సరి, పల్లెప్రకృతి వనం, బ్రహ్మండమైన పారిశుద్ద్యంతో కళకలలాడుతున్నాయని అన్నారు. గ్రామ అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం సమృద్దిగా నిధులను కూడా సమకూర్చిందని పేర్కోన్నారు. గతంలో మంచినీటి కొరకు తీవ్రమైన ఇబ్బందులు పడేదని, బోర్లకె దాదాపు నిధులకు ఖర్చుచేయడం జరిగేదని, కాని ఆ ఖష్టాలను తీర్చేలా మీషన్ భగీరథ కార్యక్రమం ప్రతి ఇంటికి మంచినీరు అందించేలా ఇబ్రహీంపట్నం డబ్బా గ్రామం నుండి ప్రతి గ్రామంలోని మంచినీటి ట్యాంకులకు నీరు అందించడం జరుగుతుందని అన్నారు. మనం అందించే మంచీనీటిని ప్రతిరోజు పరీక్షించి, మనం కోనుగోలుచేసుకునే నీటికన్న సురక్షితమైన నీరు అందించడం జరుగుతుందని పేర్కోన్నారు. మరో పది రోజులలో పైపులైను వార్డులకు పైపులైను వేయడం జరుగుతుందని పేర్కోన్నారు. గొర్రెల పంపిణి కార్యక్రమం ద్వారా 40 లక్షల కుటుంబాలకు యూనిట్లను పంపిణి చేయడం జరిగిందని, జిల్లాలో 2800 డిడిలు కట్టిన కుటుంబాలకు విడతల వారిగా గోర్రెలను పంపిణి చేయడం జరుగుతుందని అన్నారు. దేశంలో ప్రశంసలు అందుకుంటున్న రాష్టం కేవలం తెలంగాణ మాత్రమే, దేశంలోనే తెలంగాణ 1కోటి 48 లక్షల మేట్రిక్ టన్నుల దాన్యం పండించడం జరిగిందని అన్నారు. జిల్లాలో 5లక్షల 56 వేల మెట్రిక్ టన్నుల దాన్యం కోనుగోలు చేసి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని అన్నారు. తెలంగాణ ఆవిర్బావం అనంతరం గిరిజనుల అభివృద్ది కొరకు గిరిజన ఆశ్రమ పాఠశాలలను ఏర్పాటు చేశారని, చదువుకు దూరంగా ఉండె గిరిజనులు ఉన్నత విద్యను అభ్యసించి శిఖరాగ్రాన నిలిచేలా చేసిన ఘనత కేవలం తెలంగాణకు మాత్రమే దక్కుతుందని అన్నారు. గిరిజనులు ఇంకా ఏవైన సమస్యలు ఉన్నట్లయితే వాటిని మాదృష్టికి తీసుకువచ్చి సమస్యలు పరిష్కరించుకొవాలని, అవసరం మెరకు అధనంగా నిధులను కూడా సమకూర్చడం జరుగుతుందని అన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. రవి మాట్లాడుతూ పల్లెప్రగతిలో భాగంగా పంచాయతి రోడ్లలో పద్దతి క్రమంలో పెద్ద మొక్కలను అవెన్యూ ప్లాంటేషన్ లో నాటి వాటిని సంరక్షించాలని తెలిపారు. 42 లక్షల మొక్కల పెంపకం లక్ష్యంగా 7వ విడత హరితహారం కార్యక్రమం నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో గ్రామాలకు ఆర్థికంగా ప్రయోజనం ఉండే విధంగా బయో మొక్కలు పెంచుతున్నామని, అధికంగా వెదురు మొక్కలు పెంచున్నామని కలెక్టర్ వివరించారు. గ్రామాలో డ్రైయినేజీ పరిశుభ్రం చెసుకోవాలని, డ్రైయినేజీ ఆక్రమణలను గుర్తించి వాటిని వెంటనే తొలగించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.
జగిత్యాల శాసనసభ్యులు డా.సంజయ కుమార్ మాట్లాడుతూ, నీటివనరులు పెరగడం వల్ల చేపల పెంపకం ద్వారా అనేక మంది జీవనోపాధి పొందుతున్నారని ఎమ్మెల్యే తెలపారు. పంచాయతి రాజ్ శాఖ కింద జగిత్యాల జిల్లా గ్రామాలో రొడ్లు బాగుచేసుకునేందుకు, మట్టీ రొడ్లు లేకుండా చెసే దిశగా రూ.50 కోట్ల మంజూరు చేయాలని ఎమ్మెల్యే మంత్రిని విజ్ఞప్తి చేసారు.
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి దావ వసంత, గ్రంధాలయ సంస్థ ఛైర్మెన్ చంద్రశేఖర్ గౌడ్, డిసిఎంస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, యంపిపి సంద్యారాణి, జట్పిటిసి అశ్విని జాదవ్, యంపిటిసి కవిత, ఎయంసి చైర్మన్, హబ్సిపూర్ సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డి, కల్లెడ సర్పంచ్ మహెశ్వర్రావు, సర్పంచ్ లత, యంపిటిసి పరుశురాం గౌడ్, సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారి చేయనైనది.

Share This Post