సమిష్టి కృషితో 100% మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూర్తి …

ప్రచురణార్థం

సమిష్టి కృషితో 100% మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూర్తి …

మహబూబాబాద్ డిసెంబర్ 13.

100% మొదటి డోస్ వ్యాక్సినేషన్ సాధించడంలో సమిష్టి కృషి ఉందని జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు.

సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో 100% మొదటి డోస్ వ్యాక్సినేషన్ నిర్వహించు కోవటం పట్ల కలెక్టర్ అధికారులను అభినందించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 100% మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోవడం పట్ల అధికారులు చేసిన కృషిని అభినందిస్తూ ఇదే స్ఫూర్తితో రెండవ డోసు కూడా వంద శాతం పూర్తి చేయాలని తెలిపారు.

ఉద్యోగస్తులు బదిలీల కొరకు ఆప్షన్లను నోడల్ అధికారుల ద్వారా ఉన్నతాధికారులకు పంపించాలన్నారు.

గిరి వికాసం పథకం కొరకు అర్హులైన వారు సంబంధిత అధికారులకు దరఖాస్తులు అందించాలన్నారు.

ప్రభుత్వ కార్యాలయాలలో మౌలిక వసతుల కల్పనపై తీసుకున్న చర్యలను ఫోటోల రూపంలో నివేదికలు సమర్పించాలన్నారు.

ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రతివారం స్వీకరించిన దరఖాస్తుల వివరాలతో నివేదిక అందజేయాలన్నారు.

జిల్లా అధికారులు ప్రతి నెల 10వ తేదీ లోపు ముఖ్య ప్రణాళిక అధికారి కి ఇండికేటర్స్ అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ కొమరయ్య జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
————————————————————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post