సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయుటకు ప్రత్యామ్నాయ పనులు నిరంతరాయంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ కెపిసి కంపెనీ అధికారులను ఆదేశించారు.

మంగళవారం సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనులను ఆయన ఆకస్మిక తనిఖీ చేసి హాలు హాలు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫ్లోరింగ్, విద్యుత్ ఏర్పాటు పనులతో పాటు సీలింగ్ పనులు ప్రత్యామ్నాయ పనులు చేపట్టాలని, పని విభజన చేయడం వల్ల జాప్యానికి తావు లేకుండా నిరంతరాయంగా జరుగుతుంటాయని ఆయన స్పష్టం చేశారు. కలెక్టరేట్ ముందు అందమైన మొక్కలు నాటేందుకు ప్లాంటేషన్ ప్రణాళిక తయారు చేయాలని చెప్పారు. కలెక్టరేట్ సముదాయంలోని ఖాళీ ప్రదేశాన్ని అందమైన మొక్కలతో పాటు ఫాంటేన్ ఏర్పాటు చేయాలని చెప్పారు. కలెక్టరేట్ నిర్మాణ పనులల్లో ఇప్పటికే కాలయాపన జరిగిందని ఇకముందు కాలయాపన జరగడానికి వీల్లేదని పనులు ముమ్మరంగా జరుగుతుండాలని ఆయన స్పష్టం చేశారు. నీటి సరఫరా కొరకు (ఓహెచ్ఎస్ఆర్) భార జల నీటి బండారం ద్వారా నీటి సరఫరా చేయు విధంగా చర్యలు తీసుకోవాలని పాల్వంచ మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. వర్షపునీరు బయటికి వెళ్లకుండా నీటి సంరక్షణకు చర్యలు చేపట్టాలని చెప్పారు. కార్యాలయం నుండి వెలువడే వ్యర్థాలను వర్మి కంపోస్టు తయారు చేయుటకు ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. కలెక్టరేట్ నిర్మాణంతో పాటు కలెక్టర్, అదనపు కలెక్టర్ ఇతర అధికారుల నివాస గృహాల నిర్మాణ పనులను కలెక్టరేట్ నిర్మాణ పనులతో పాటే పూర్తి చేయాలని చెప్పారు. నిధులు సమస్య వస్తే తన దృష్టికి తీసుకురావాలని, నిధుల కొరత సాకు చూపించి పనులు జాప్యం చేయడానికి వీల్లేదని ప్రాధాన్యతను గుర్తించి పనులు వేగవంతం చేయాలని చెప్పారు. తనకు పనులు చేపించి చూపించాలని ఆయన స్పష్టం చేశారు. వచ్చే సంవత్సరం మార్చి మాసాంతం వరకు నిర్మాణ పనులు పూర్తి చేయాలని జాప్యం కావడానికి వీల్లేదని చెప్పారు. పనులు ముమ్మరంగా జరిగేందుకు వీలుగా అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. జరుగుతున్న పనులపై ఎప్పటికప్పుడు తనకు నివేదికలు అందచేయాలని ర.భ.. ప్రాజెక్టు డిజియంకు సూచించారు. ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని పనులు జాప్యం కాకుండా ఎక్కువ సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. అనంతరం పనులు నిర్వహణకు చేయబడిన ఏర్పాటు చేసిన షెడ్యూలును కలెక్టర్ పరిశీలించి, షెడ్యూలు ప్రకారం పనులు జరగాలని చెప్పారు. కార్యాలయంలో రెండు లిఫ్టులు ఏర్పాటు చేయనున్నామని, లిఫ్ట్ ఏర్పాటు పనులను కూడా ముమ్మరం చేయాలని చెప్పారు. అధికారుల నివాస గృహా సముదాయాలకు ప్రహారీగోడ నిర్మించేందుకు నిర్మాణానికి అయ్యే వ్యయపు అంచనా నివేదికలు సత్వరం అందచేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ర.భ. ఈఈ బీమ్లా, మిషన్ బగీరథ ఈఈ తిరుమలేష్, ఇంట్రా ఈఈ నళిని, ర.భ. డిఈ నాగేశ్వరావు, పాల్వంచ మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, తహసిల్దార్ స్వామి, కెపిసి కంపెనీ ప్రాజెక్టు డిజియం నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Share This Post