సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనులు పూర్తయ్యే నాటికి ప్రాంగణంలో మొక్కలు నాటే ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

శుక్రవారం కలెక్టర్ ఆకస్మికంగా కలెక్టరేట్ నిర్మాణ పనులు, ప్రాంగణంలో నాటేందుకు తెచ్చిన మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి మాసాంతం వరకు కలెక్టరేట్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని చెప్పారు. ప్రధాన రహదారి నుండి కలెక్టరేట్ వరకు మూడు విడతల వరుసల్లో మొక్కలు. నాటాలని చెప్పారు. కార్యాలయ ప్రాంగణంలో కార్వింగ్జీప్ బెంచీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. కలెక్టరేట్ మొత్తం పచ్చదనంతో కళకళలాడాలని, ఆదర్శంగా నిలవాలని చెప్పారు. కార్యాలయంలో జరుగుతున్న ఇంటీరియల్ పనులను పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, ఎక్కడా రాజీపడొద్దని స్పష్టం చేశారు. సమావేశపు హాలు నందు పిఏ సిస్టం ఏర్పాటు చేయుటకు ప్రతిపాదనలు తయారు చేయాలని చెప్పారు. ఈ కార్యాలయం ప్రజలకు సేవలందించేందుకు పది తరాల వరకు సేవలు అందించే కార్యాలయమని చెప్పారు. పనులు వేగంగా పూర్తి చేయాలని, చేయాల్సిన పనలకు. ప్రత్యామ్నయంగా ఇతర పనులు కూడా చేపట్టాలని సైట్ ఇంజనీర్కు సూచించారు. కలెక్టరేట్లో మొక్కల నిర్వహణ బాధ్యతలను మున్సిపాల్టీ పర్యవేక్షణ చేయాలని మున్సిపల్ కమిషనర్కు సూచించారు. మొక్కలు ఏ విధంగా నాటాలో అధికారులకు వివరించారు. మురుగునీటి కాల్వలు నిర్మాణ పనులను మున్సిపల్ కమిషనరన్ను అడిగి తెలుసుకున్నారు. పాల్వంచ మున్సిపల్ పరిధి ప్రారంభం నుండి రహదారులకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి ఎక్కడా గ్యాప్ లేకుండా బ్రహ్మాండంగా మొక్కలు నాటాలని చెప్పారు. మీడియన్ ప్లాంటేషన్లో అందమైన మల్టీపర్పస్ మొక్కలను నాటాలని వారంలో ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలని చెప్పారు. ఆరు అడుగులు ఎత్తున్న మొక్కలు నాటడం వల్ల. మొక్కల సంరక్షణ బావుంటుందని, మంచి ఏపుగా పెరుగుతాయని చెప్పారు. జిల్లాకు ఇదొక ఐకాన్ రహదారి కావాలని ఆయన స్పష్టం చేశారు. అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ర.భ. ఈఈ భీమ్లా, డిఈ నాగేశ్వరావు, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, తహసిల్దార్ స్వామి, సైట్ ఇంజనీర్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Share This Post